జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సేవలు మరువరానివి
తూప్రాన్ దినోత్సవం అక్టోబర్ 11:: గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలు మరిచిపోరని వారు మరిన్ని సేవలు చేయాలని ఆశిస్తున్నట్లు తూప్రాన్ మున్సిపల్ ఏడవ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ పుర పాలక పరిధిలో గల అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్ఞానంతో ఆనందం అనే వర్క్ బుక్స్ ను పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ అన్నీ దానాలలో కెల్లా విద్యాదానం గొప్పదని, ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్న జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సేవలు మరువరానివని అన్నారు ప్రతి సంవత్సరం పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు నోట్ బుక్స్ ఇతర సామాగ్రి అందిస్తున్నారని ఆయన వారిని కొనియాడారు ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ భారతి కోడె ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం దాదాపుగా 1000 మంది విద్యార్థులకు ఈ జ్ఞానంతో ఆనందం అనే వర్క్ బుక్స్ ను అందజేయడం జరుగుతుంది అని అన్నారు.
కార్యక్రమంలో జిఎంఆర్ సంస్థ సిబ్బంది ప్రవీణ్ కుమార్, వసంత్ సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్య రాణి, పద్మావతి, సునీత, ఫౌండేషన్ వాలంటీర్ జ్యోత జిఎంఆర్ ఐటి రాజాం కళాశాల విద్యార్థులు, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.