జిల్లాకో మహిళా పారిశ్రామిక వాడ

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు సహకారం
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డినల్గొండ , ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతిజి ల్లాలో మహిళా పారిశ్రామిక వాడలను నిర్మించేం దుకు ఈరోజు బృహత్తర నిర్ణయాన్ని తీసుకున్నామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మహిళా స్వశక్తి సంఘాలవారు ముందుకు వచ్చేవారికి 30, 40 ఎకరాల స్థలాలు కేటాయిస్తామన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన అమ్మహస్తం పేరుతో 185 రూపాయలకే రేషన్‌ సరుకులు పంపిణీచేసే కార్యక్రమం ప్రారంబోత్సవంలో సిఎంపాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు గతంలో కేవలం 1700మంది విద్యార్థులకు రెండుకోట్లు మాత్రమే ఇచ్చేవారన్నారు. అయితే నేడు 230కోట్లను లక్షాయాబైవేలమందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామన్నారు. రైతులు పంటరుణాలు తీసుకున్నవారు నయా పైసా వడ్డీ చెల్లించాల్సినవసరం లేదన్నారు. 2004 పంట రుణాలకు 11శాతం ఉండేదన్నారు. దీనిని ఏడుశాతంకు కేంద్రం          మిగతా 2లోతగ్గించిందన్నారు. ఒకే సంవత్సరంలో అసలు చెల్లిస్తే మూడుశాతం వడ్డీ మినహాయిస్తోందని మిగతా నాలుగుశాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అన్ని బ్యాంకులను అనుసంధానం చేసి రైతులు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈనెల 30లోగా అన్ని బ్యాంకులను అనుసంధానం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. కలెక్టర్‌ వెంటనే బ్యాంకర్ల సమావేశం ఏర్పాటుచేసి వడ్డీ మాఫీ పథకాన్ని విపులీకరించాలని సిఎం ఆదేశించారు. నాలుగులక్షల 75వేల కోట్ల రూపాయలు ఇచ్చేవారని, నేడు ఏడు లక్షల కోట్ల రూపాయల రుణాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమదేనన్నారు. రాష్ట్రంలో 72వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోనున్నారన్నారు. 58వేలకోట్ల పంటరుణాలున్నాయన్నారు. పండించిన దాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎగుమతి చేసేందుకు 50లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం అనుమతిస్తే రాష్టాన్రికి చెందనవే 30లక్షల మెట్రిక్‌ టన్నులన్నారు. వరి ధాన్యానికి మద్దతు ధర 1200 నుంచి 1300 రూపాయలు ఇస్తున్నామన్నారు. బయట మార్కెట్‌లో 25 రూపాయల ధర బియ్యం ఉంటే ప్రభుత్వం ఒకరూపాయికే ఇస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు తొమ్మిదింటిని కలుపుకుని తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. ఏకార్యక్రమంలోనైనా ఇబ్బందులుంటాయని, టిడిపి, వైసిపి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పేదవారికి మేలు చేయాలనే తపన కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. టిడిపి మొండి హస్తం అంటూ చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేదవారి ఆకలి చూస్తుందన్నారు.మిగతా పార్టీలు మాత్రం సీట్లు, ఓట్లు పొందందుకు కళ్లబొల్లి కబుర్లు చెపుతున్నాయన్నారు. రెండేళ్లలో యువతకోసం లక్షా 23వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. యాభై లక్షల మంది యువత పరీక్షలు రాశారన్నారు. ప్రతిభ మేరకే ఉద్యోగంవచ్చింది తప్ప కిరణ్‌కు,  మంత్రికి, ఎమ్మెల్యేకు నాయకులకు దగ్గరున్నవారికి ఉద్యోగాలు రాలేదన్నారు. నీతి నిజాయితీగా ఉద్యోగాలు ప్రతిభ కలవారికే వచ్చేలా చేశామన్నారు. అయిదేళ్లు మాత్రమే మేంఉంటాం, అదే అవినీతితో ఉద్యోగంలోకి వస్తే 38ఏళ్లపాటు సేవచేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, టెంపరరీ ఉద్యోగాలే ఇచ్చారని, తానే 83వేల కొత్త ఉద్యోగారలు ఇచ్చానన్నారు. మరో లక్షాయాభై వేల ఉద్యోగాలు ఖాళీలవి భర్తీ చేశామన్నారు. పరీక్షలు రాయలేక, ఉద్యోగాలు చేయ లేక పోయిన నిరుపేదలకు రాజీవ్‌ యువకిరణాలద్వారా శిక్షణ నిప్పిస్తున్నామన్నారు. ఉద్యోగాలు చేయలేక, వ్యాపారం చేసుకోవాలనుకునే 2లక్షల 60వేల ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. త్వర లోనే బిసిలకు మైనార్టీలకు సైతం అదే తరహాలో ప్యాకేజిని తెస్తామన్నారు. నెలనెలా రాష్ట్రంలోని రెండున్నరకోట్ల కుటుంబాలకు ఏడున్నర కోట్ల మందికి నేరుగా లబ్ది చేకూర్చే పథకంపై అనవసరంగా విమర్శు గుప్పిస్తున్నా రని సిఎం ఆరోపించారు. బిసిలకు కేరాఫ్‌గా చెప్పుకుంటున్న నడక మిత్రుడు నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా 9 ఏళ్లలో కేవలం 138 కోట్లు బిసిలకు వెచ్చించాడని, అయితే తమ ప్రభుత్వం ఈఒక్క ఏడే 4027 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నామన్నారు. అంటే బిసిల పక్షపాతి తమ ప్రభుత్వందా, చంద్రబాబుదా ఆలోచించాలన్నారు. ఎస్సీఎస్టీ విద్యార్థులు విదేశాలకు పోయేందుకు పదిలక్షల రూపాయలు ఇవ్వడమేకాకుండా మరో అయిదు లక్షలు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తున్నామన్నారు. చదువుతున్న వారికోసం 30వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రెండు దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు తగ్గించారని, నేడు తాము 80వేల ఉద్యోగాలు సృష్టించామన్నారు. మరో 60వేల ఉద్యోగాలు నియమించపోతున్నామన్నారు. రాజీవ్‌ యువకిరణాలు పేరుతో మూడులక్షల మందికి ఉద్యోగాలివ్వాలనే ఉద్దేశ్యంతో రోజుకు వెయ్యిమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్న ఘనమైన చరిత్ర తన ప్రభుత్వానిదేనన్నారు. బ్యాంకులు రైతులనుంచి వడ్డీలు చెల్లిం చాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా తనకు సమాచారం వస్తోందని, ఒక్కరైతు కూడా అలాంటివి చెల్లించవద్దని ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 1975-76లోఎస్సీ, 1979-80 సంవత్సరాల్లో ఎస్టీలనిధులకు చట్ట బద్దం కల్పించే ఉద్దేశ్యంతో ఇందిరాగాంధీ ప్రయత్నించినా కాలం కలిసి రాకపోవడం వల్ల అమలు సాధ్యం కాలేదన్నారు. అయితే ఆనాటి ఆలోచనను ఆమె కోడలు సోనియాగాంధీ సూచన మేరకు తాము రాష్ట్రంలో నేడు ఆఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. వందల ఏళ్లుగా ఎస్సీలు, అట్టడుగునే ఉంటూ దినదినం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నందునే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఎస్టీసబ్‌ప్లాన్‌ పథకాన్నితీసుకురావడం జరిగిందనిముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  ఎస్సీలఅభివృద్దే ప్రధాన లక్ష్యంగా సబ్‌ప్లాన్‌కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈసంవత్సరం ఎస్సీలకు 8585కోట్ల రూపాయ లను, ఎస్టీలకు 3666 కోట్ల రూపాయలను వారి వారి జనాభా ప్రకారం కేటాయించడం జరిగిందని, వీటిని సక్ర మంగా అందేలా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రక్కదారి పట్టే అవకా శాలు లేనేలేవన్నారు. ఒక వేళ కేటాయించిన మొత్తం ఖర్చు చేయకపోతే వచ్చే సంవ త్సరంలో వాటిని కలుపుకుని వెచ్చించాల్సిందేనన్నారు. అధికారంలో ఏపార్టీ ఉన్నా కూడా ఈపనిని చేపట్టి తీరాల్సిందేనన్నా రు. విద్యావంతులైన యువకులు ముందుకువచ్చి నిరక్షరాస్యులను చైతన్యంచేయాలని సిఎం పిలుపు నిచ్చారు. తెలుగుదేశంపార్టీ,సిపిఐ, బిజెపి,వైసిపి, సిపిఎం, ఎంఐఎంలు మద్దతుఇస్తారనుకున్నా కూడా తూట్లు పొడిచారన్నారు. రెండురోజులపాటు చర్చజరిపితే నడకఆపి అసెంబ్లీకి వస్తాడనుకున్నా కూడా రాలేదన్నా డు. చారిత్రాత్మకమైన చట్టం తెచ్చినప్పుడు ఆయనకు బాద్యతలేదా, అసెంబ్లీకి రావాల్సినవసరంలేదాని ఆయనప్రశ్నించారు. టిడిపి, బిజెపి, వైసిపి, టిఆర్‌ఎస్‌లు కుమ్ముక్కై చట్టాన్నితేకుండా కుట్ర పన్నాయని, అయినా తాను కాంగ్రెస్‌ వెనక్కిపోలేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన చిన్నపాటి విషయాన్ని అడ్డుపెట్టుకుని బిల్లు రాకుండా ప్రతిపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. దళారీ వ్యవస్థకు చోటు కల్పించవద్దన్నారు. ఇందుకోసం గ్రామాలకు వచ్చి ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనివిదంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వెచ్చిస్తున్న నిధులకు చట్టబద్దతకల్పిస్తూ సబ్‌ప్లాన్‌ను తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ముఖ్య మంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పార్టీలను అవసరమైనప్పుడు కర్రుకాల్చివాత పెట్టాలని ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలనే రీతిలో సూచించారు.  ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో బకాయిలుగాఉన్న 268 కోట్లరూపాయల విద్యుత్‌ బకాయిలను సబ్‌ప్లాన్‌ బడ్జెట్‌లోంచి చెల్లిస్తున్నామన్నారు. రాబోయేకాలంలో కూడా ప్రతిఒక్కరు మీటర్‌ను బిగించుకుంటే యాబైయూనిట్లవరకు బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తాము తగ్గించిన బిల్లులవల్ల కోటి86లక్షల గృహాలకు లబ్దిచేకూరబోతోందన్నారు. రెండుకోట్లగృహాల్లో ఇంత మందికి లబ్దిచేకూరుతున్నావారికి పట్టడం లేదని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని, వృధాచేస్తూ ప్రభు త్వానికి భారం తీసుకురావద్దన్నారు. బయటకు వెళ్లే సమయంలో ఫ్యాన్లు, టీవిలు, లైట్లుఆఫ్‌ చేసి వెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు సలహాలు మాకు అక్కరలేదన్నారు. పేద ప్రజలసూచనల తోనే తాముపథకాలు చేపడుతున్నామన్నారు.  మాకుప్రాధాన్యత ఎస్సీఎస్టీలైతే బాబుకుపాదయాత్రే ముఖ్యంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడైనా 30వేలకోట్ల రూపాయల సబ్సీడిలు ఇచ్చిన ప్రభుత్వాలు న్నాయోమే పరీక్షించుకోవాలన్నారు. ఎస్సీల పక్కాగృహాలకు ప్రస్తుతంఉన్న 60వేల రూపాయలను లక్షకు పెంచిన్నట్లు ఆయన ప్రకటించారు. ఎస్టీలకు లక్షాఅయిదువేలు మంజూరు చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వింటే పదిపదిహేను సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. నిరుపేదలకిచ్చే అమ్మహస్తం పథకంను మొండిహస్తం అని పెట్టుకోవాలని సూచిస్తున్నాడంటే తెలుపురంగు రేషన్‌కార్డుదారులంటే ఆయనకున్న ప్రేమఎంత ఉందో తెలుసు కోవాలన్నారు. హుజూర్‌నగర్‌లో 216 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణాలో ఎక్కువ మెజార్టీ ఇచ్చిన హుజూర్‌ నగర్‌ నియోజకవర్గానిదేనన్నారు. పులిచింతల కోసం భూములు కోల్పోయినవారికి నష్ట పరిహారం చెల్లిస్తామని, రెండు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నామన్నారు. హైలెవర్‌ బ్రిడ్జ్‌ 45కోట్లు కృష్ణానదిపై నిర్మించేందుకు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. హుజూర్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు కావాలంటే పట్టణం అందం పోతుందని, అయితే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎల్లప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మద్దతివ్వాలని సిఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఎంపి గుత్తాసుఖేందర్‌రెడ్డి, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు.