జిల్లాలో గొప్పగా పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలను జరుపుకోవాలి

 

దేశభక్తి పెంపొందించే విధంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలి

ఆగస్టు 08 నుండి 22 వరకు వజ్రోత్సవాలు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

000000

స్వాతంత్య్రన్ని సాధించుకుని 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాలో గొప్పగా పండుగ వాతావరణంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

శుక్రవారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లాస్థాయి అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారని సూచించారు. శాసన సభ్యులు, జెట్పిటిసిలు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. జిల్లాలో పెద్ద మొత్తంలో జాతీయ జెండాను ఎగురవేసే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. ధర్మపురిలో స్వాతంత్ర్య సమరయోధుడు గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి కె.వి.కేశవులు అని మంత్రి తెలిపారు. గంగాతీరంలో కూడా స్వాతంత్య్ర సమరయోధుడు జగిత్యాల జిల్లాలో ఉండటం విశేషమని జగిత్యాల జిల్లా గొప్పదనాన్ని భావితరాలకు చేరవేయాలని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చోరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని, ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిశా నిర్దేశాల మేరకు ఈ నెల 8 నుండి 22 వరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలను జరుపుకోవాలని అన్నారు. ఒక్కోరోజు ఒక్కో యాక్టివిటి అన్ని నియోజక వర్గాల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కొన్ని కార్యక్రమాలు గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో వేరువేరుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 5 మున్సిపాలిటిలలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. 5 వ తరగతి నుండి 10 వ తరగతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించాలని ఆదేశించారు. మండలం వారిగా దాటాను తీసుకుని ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణి చేయాలనీ అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణ శ్రీ, మున్సిపల్ చైర్మరన్లు బోగ శ్రావణి, సంగి సత్తమ్మ, జెడ్పి చైర్ పర్సన్ వసంత, డిఎస్పి. ప్రకాష్, డి.ఆర్.డి.ఓ.నరేష్, ఆర్.డి.ఓ.లు, జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

వజ్రోత్సవాల షెడ్యూల్‌
———————————
ఆగస్టు 08: వజ్రోత్సవాలు ప్రారంభం

ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.

ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు.

ఆగస్టు 11: ఫ్రీడం రన్‌ నిర్వహణ.

ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.

ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..

ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద
కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.

ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.

ఆగస్టు 16: ‘ఏకకాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు,ముషాయిరాల నిర్వహణ.

ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ.

ఆగస్టు 18: ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ.

ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.

ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ జగిత్యాల చే జారీ చేయనైనది