జిల్లాస్థాయి 10-10 క్రికెట్‌ టోర్నీ

నిజామాబాద్‌:

తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్‌ 10-10 క్రికెట్‌ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల రోటరీ మైదానంలో నిర్వహించనున్నట్లు అభినమ్‌,సతీష్‌లు ఓ ప్రకటలోని చెప్పారు.ఓపెన్‌టూఆల్‌  పద్దతిలో  జరిగే ఈ టోర్నీలో పాల్గొనదలిచిన జట్టు తమ ఎంట్రీలను నిర్ణీత  ఫీజుతో జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తా దగ్గర మున్నూరుకాపు కల్యాణ మండపం కాంప్లెక్స్‌లోని ‘బాయిస్‌ కలెక్షన్‌’లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య సమయంలో అందజేయాలని తెలిపారు.