జిల్లా కాకపోవడంతోనే రైలు నిలవడం లేదు:-

ప్రభుత్వం స్పందించి జిల్లా చేయాలి:-
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా కేంద్రం కాకపోవడంతోనే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఆగాల్సిన రైలు ఆగడం లేదని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు తెలిపారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆగక పోవడానికి కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ 8 రైలు మిర్యాలగూడ గుండా వెళ్తున్నప్పటికీ కేవలం మూడు రైళ్లు మాత్రమే ఆగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని రైలు ఆపే అవకాశం ఉందని తక్షణం ప్రభుత్వం మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా చేయాలని కోరారు. ప్రధానంగా నారాయణాద్రి చెన్నై విశాఖ డెల్టా ఎక్స్ప్రెస్ నరసాపురం ఎక్స్ప్రెస్ ఆగక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంకనూ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి జిల్లా కేంద్రమే మార్గమన్నారు. అనంతరం మిర్యాలగూడ జిల్లా చేయాలని కోరుతూ స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారుక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్,ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు, మానవ హక్కుల ఫోరం నాయకులు జాగటీ శేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు