
జూలై 15 జనంసాక్షి : జిల్లా వ్యవసాయ అధికారిని కె.అనురాధ ఆకస్మికంగా మండలంలోని దత్తప్పగూడెం, అనాజిపురం రైతు వేదిక పరిధిలోని పాలడుగు,అనాజిపురం గ్రామాలలో వ్యవసాయ శాఖ నూతనంగా చేపడుతున్న అధిక సాంద్రత పత్తి విధానంలో సాగు చేస్తున్న పత్తి పంటను పరిశీలించి రైతుకు తగిన సలహాలు సూచనలు చేశారు.భూమిలో నిల్వ ఉండే బస్వరంను కరగదీసే జీవన ఎరువు వాడిన రైతు యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకోవడమైనది. పచ్చిరొట్ట పంట అయిన జీలుగ పొలాన్ని పరిశీలించి దాని ప్రయోజనాలను రైతులకు తెలిపారు. అనంతరం రైతు వేదికలను సందర్శించి వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడమైనది.రైతు వేదికల చుట్టూ కూరగాయలు, ఆకుకూరలు,పండ్ల చెట్లు,జీవకంచె ఏర్పాటు చేయవలసినదిగా వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీ రామ ఫెర్టిలైజర్, శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఫెర్టిలైజర్ దుకాణం లో తనిఖీ చేసి రికార్డ్స్, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి కె.స్వప్న,వ్యవసాయ విస్తరణ అధికారులు జే.సైదులు,టి.గోపీనాథ్,రైతుబంధు సమితి గ్రామ సమన్వయకర్త ఎన్.సత్యనారాయణ,రైతులు బి.రోషి రెడ్డి,కే.రాములు,సి.హెచ్.వెం
కటయ్య తదితరులు పాల్గొన్నారు.