జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ
వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్ సీపీ పార్టీ అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. ఈ నెల 23న విజయ నేతృత్వంలో తలపెట్టిన చేనేత దీక్షకు నిరసనగా శనివారం నాడు వేములవాడలోని తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది విద్యార్థులతో మానవ హారం ఏర్పా టుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ నాయకులు, తెలంగాణ వాదులు విజయ పర్యటనను నిరసిస్తూ ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విజయమ్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి వెం గళ శ్రీకాంత్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మశెట్టి విజయ్ తదితరులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆది నుండీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా తెలియజేయకుండా పూటకో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు 8 వందల మందికి పైగా విద్యార్థులు, తెలంగాణవాదులు ఆత్మహత్యలకు పాల్పడితే వైఎస్సార్‌సీపీ అధినేతలు కనీసం ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చడానికి తెలంగాణ ప్రాంతంలో పర్యటించలే దని ఆరోపించారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణ యాల కారణంగానే వందలాది సిరిసిల్లా చేనేత కార్మికులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని, అలాగే తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా దివంగత వైఎస్సాఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ ప్రాంత ప్రజలెన్నటికీ మరచిపోరని విమర్శించారు. తమ పార్టీ తెలంగాణవా దానికి వ్యతిరేకం కాదని చెబుతున్న ఈ ప్రాంత వైఎస్సాఆర్‌సీపీ నాయకులు తమ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మతో తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయించాలని, లేనట్లయితే విజయ పర్యటనను ఆరునూరైనా ఖచ్చితంగా అడ్డుకుని తీరతామని వారు స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నేరెళ్ళ తిరుమల్‌గౌడ్, టీఆర్ ఎస్ నాయకులు మాదాడి గజానందరావు, ఎర్రం మహేశ్, పీచర భాస్కర్‌రావు, ఈర్లపెల్లి రాజు, రాంబాబు, టీఆర్‌ఎస్‌వీ నాయకులు నిమ్మశెట్టి విజయ్, సార్ల చారి, మల్కాపురం గంగన్న, కాసర్ల అరుణ్, పర్వతం అంజి, రాజశేఖర్‌లతో పాటు వందలాది విద్యార్థినీ విద్యార్థు లు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో…
సిరిసిల్లలో ఈ నెల 23న చేనేత కార్మికుల సమస్యలను తీర్చడానికి వస్తున్న వైఎస్సార్ పార్టీ నాయకురాలు విజయ వచ్చే ముందు తెలంగాణ పై మీ స్పష్టమైన వైఖరి ఏమిటో తేల్చి చెప్పాలని టీఆర్‌ఎస్ నాయకులు సీ.సత్యనారాయణరెడ్డి ఐబి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ సమస్య తెలంగాణ ప్రజల మనోభాలకు సంబంధించిన విషయమని గత 12 సంవత్స రాల నుంచి ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీల వైఖరి కూడా వేరు వేరు తెలుపుతున్నారు. వైఎస్సార్ పార్టీ నాయకులు వైఎస్.రాజశేఖరరెడ్డి వారసులగా మళ్లీ ఆయన పాలన తీసుక వస్తామని అంటున్నారు. కాని వైఎస్ హయాంలోనే టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తులు కలుపుకుని ఐదు సంవత్సరాలు తెలంగాణను దాటవేశారన్నారు. ఇక్కడ ఎన్నికలు ముగియగానే ఆంధ్ర ప్రచారంలో తెలంగాణ పోవాలంటే వీసాలు తీసుకోవాలని అక్కడి ప్రజలతో అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేస్తే జగన్ మాత్రం నేను సమైక్యాంధ్ర వాసినని తన వైఖరిని తెలిపారు. సిరిసిల్లలో మీరు పర్య టన చేయచ్చు అంతకన్నా ముందు తెలంగాణపై మీ వైఖరి తెలు పాలని అన్నారు. వైఎస్సార్ హయాంలోనే చేనేత కార్మికుల ఆత్మహ త్యలు ఎక్కువగా అయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ తరుపున కేసీఆర్ భిక్షా టన చేసి చేనేత కార్మికుల కుంటుంబాలకు ఒక్కోక్కరికి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. రాజకీయంగా అన్ని సం ఘాల వారు ఈ పర్యటనకు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణపై అభి ప్రాయం తెలుపకుండా పర్యటన చేస్తే ఖచ్చితంగా దానిని అడ్డుకుం టామని పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవ డానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల రాంముర్తి, అడెపు సుధాకర్, నంబారావు, కొమురయ్య, రాజుకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో…
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శని వారం పట్టణ టీఆర్‌ఎస్వీ నాయకుడు దొనికెన పూర్ణచందర్ అధ్వ ర్యంలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొనికెన పూర్ణచందర్‌గౌడ్ మాట్లాడు తూ ఈ నెల 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయ సిరిసిల్ల పర్యటను నిరసిస్తూ యావత్ తెలంగాణ ప్రజా నీకం వ్యతిరేకిస్తుందని, ఇన్ని వ్యతిరేకాల మధ్య సిరిసిల్లలో అడుగు పెడితే మరో మానుకోట పునరావృతం అవుతుందని వారు హెచ్చరిం చారు. చేనేత మరణాలు అన్ని కూడా వైఎస్ పాలనలోనే జరిగాయని అలాంటి నేత బొమ్మతో పార్టీ పెట్టుకుని తెలంగాణ ప్రజానీకాన్ని వం చిస్తే ఉరుకోమని అన్నారు. కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రాంతానికి తరలించుకు అందుకు మమ్మల్ని అదరిం చండి అని వస్తున్నారా…? 800 మంది విద్యార్థులు తెలంగాణ కోసం అత్మబలీదానాలు చేసుకుంటే వారి కుటుంబాలను ఏ ఒక్క రోజు ఓదార్చలేదు అందుకు మమ్మల్ని అదరించండి అని వస్తున్నారా…? వేల మంది చేనేత కార్మికుల అత్మహత్యలకు మా ఆయన వైఎస్సార్ కారణం అందుకు మమ్మల్ని అదరించండి అని వస్తున్నారా…? అని వారు ప్రశ్నించారు. ఒక వేళ తెలంగాణ పర్యటనకు రావాలని ఉంటే ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించి వస్తే స్వాగతిస్తామని లేకపోతే మరో ప్రతిఘటన తప్పదని సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన పాపపు చరిత్ర వైఎస్సార్‌దని నిప్పులు చెరిగారు అనంతరం వారు మోకాళ్ళపై, ఉరి తాళ్లతో నిరసనను వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకోలో పాల్గొన్నవారు టీఆర్‌ఎస్వీ జిల్లా ఇన్‌చార్జ్ ములుగు పూర్ణచందర్, మండల అధ్యక్షు డు రాము, డివిజన్ అధ్యక్షుడు బాషాబోయిన ప్రవీణ్ యాదవ్, తెలం గాణ జాగృతి జిల్లా కో-కన్వీనర్ హారిష్‌యాదవ్‌లు, కార్యకర్తలు శ్రీను, నవీణ్, హారీష్, శ్రావణ్, హాబీబ్‌లతో పాటు తెలంగాణ విద్యార్థులు పాల్గొన్నారు.
సెంటినరికాలనీలో…
వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ దిష్టిబొమ్మను శనివారం టీఆర్‌ఎస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా సిరిసిల్లాకు మొసలికన్నీరు కార్చడానికి వస్తున్న విజయమ్మ తన పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. వస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాపరబోయిన భాస్కర్, రాజు, సాంబయ్య, వేగోలపు మల్లయ్య, పి.భార్గవ్, శంకర్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో…
నేతన్నల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతానని తెలంగా ణలో అడుగు పెట్టనున్న వైఎస్ విజయమ్మను వ్యతి రేకిస్తూ శనివా రం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతు తెలంగా ణకు పూర్తి వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తూ తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న విజయమ్మకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కులేదని ఆరోపించారు. తెలంగాణ పట్ల ఆమె వైఖరి ఏమిటో స్పష్టం చేశాకనే పర్యటన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో మానుకోట ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బీలు నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు కన్నోజు రామకృష్ణ, గూళ్లరాజు, షుకుర్‌మియా, బత్తుల రవీందర్, మహిళా నాయకురాల్లు బొద్దుల కనుకలక్ష్మి, బండి పుష్ప, బొడుమల్ల బాగ్య, స్వరూప, విద్యార్థి నాయకులు రమేష్ నాయక్, దీకొండ ప్రవీణ్, ఇటిక్యాల రమేష్, అల్లాడి సంపత్, జవహర్‌లాల్, పెసరు శ్రీకాంత్, బండి చందు తదితరులున్నారు.
మెట్‌పల్లిలో…
వైఎస్సాఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఈ నెల 23న సిరిసిల్లలో చేనేత కార్మికులను ఉద్దేశించి చెపట్టనున్న దీక్షను తెలం గాణ వాదులు ఆడ్డుకొవాలని శనివారం పట్టణంలోని టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాత బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు పాల్గొని విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయమ్మ దీక్షను అడ్డుకొవాలని వారు సూచించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ గతంలో మనుకొండు వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రను తెలంగాణ వాదులు అడ్డుకున్న విషయాన్ని విజయమ్మ మరిచిపోకు ఆని వారు హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ తెలంగాణలో దీక్షలు చేయటం ఏంటని వారు ప్రశ్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలిపి అప్పుడు దీక్షలు చేయాలంటూ వారు సూచించారు. లేకుంటే జగన్‌కు పట్టిన గతి విజయమ్మకు తప్పదని వారు అన్నారు.
భీమదేవరపల్లిలో…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వైఎస్పార్ సీపీ నాయకురాలు విజయమ్మ వైఖరి తెలపాలని టీఆర్‌ఎస్ నాయకులు ములకనూర్ బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద శనివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జిల్లెల్ల గాల్‌రెడ్డి మాట్లాడుతు జగన్ తెలంగాణకు వ్యతి రేకంగా పార్ల మెంట్‌లో ప్ల కార్డులు ప్రదర్శించి తెలంగాణ వ్యతికేకిగా మారగా విజయమ్మ చేనేత కార్మికులను ఆదుకోవాలని సిరిసిల్లలో దీక్షకోసం తెలంగాణకు వస్తే ఆమెను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సుధీర్ కుమార్, లాజరస్, అశోక్ ముఖర్జీ, షర్ఫోద్దీన్, బొల్లంపల్లి రమేష్, చార్లి అశోక్, మాడ్గుల అశోక్, పూర్ణ చందర్‌రావు, లింగమూర్తి, సాదన్ .జక్కుల రాజు, బొంకూరి భద్రయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాలలో…
సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం దీక్ష చేపడుతానని రాజకీయ పర్యటన చేస్తున్న విజయమ్మ తన పర్యాటన మానుకోవాలని శని వారం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయం లబ్ధి కోసం దీక్ష, ధర్నాలంటూ తెలం గాణ ప్రాంతంలో తిరుగుతున్నారే తప్ప ఇక్కడి వారి బ్రతుకులను మార్చడానికి కాదన్నారు. తెలంగాణ ఆంశంపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే తెలంగాణలో పర్యటించాలన్నారు. లేని యెడల మానుకోట సంఘటన పునరావృతం అవుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌వీ విభాగ నాయకుడు నారపాక అశోక్, ఆరీఫ్, చంద్, శంకర్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తaల