*జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్న మోడీ*
మునగాల, జూలై 29(జనంసాక్షి): కేంద్రంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహార పదార్థాలపై పన్నులు విధించడం సరైంది కాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీ రాములు అన్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సుందరయ్య భవనములో బోళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, పన్నులు వేసి ఆహార పదార్థాల ధరలు పెంచడం ద్వారా ప్రజలపై భారాలు మోపుతూ ప్రజలను దోపిడి చేస్తూ ఉన్నత వర్గాలకు దోసి పెడుతుందని అన్నారు. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పప్పు ధాన్యాలు, పెరుగు, పన్నీరు మాంసం చేపలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తులపై పన్నులు విధించిందన్నారు. శవ దహనలపై కూడా జీఎస్టీ వేసిందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, కార్యదర్శివర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, జె విజయలక్ష్మి, మండల కమిటీ సభ్యులు బోనాల మంగయ్య, బట్టిపల్లి ఉపేందర్, మామిడి గోపయ్య, సుంకర పిచ్చయ్య, మండవ వెంకటాద్రి, ఆరే కృష్ణారెడ్డి, తుమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు.