జీఓ 59 దరఖాస్తులు పరిశీలించిన ఆర్డీఓ
రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇండ్లను తాసీల్దార్ భాస్కర్ తో కలిసి వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్
బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ పవన్ కుమార్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేసుకున్న ఇండ్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించడం జరిగిందన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో జీఓ నెంబర్ 59 ప్రకారం ఒక దరఖాస్తు రాగా
క్షేత్రస్థాయిలో ఇంటి ధ్రువపత్రాలు పరిశీలించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ భాస్కర్, ఆర్ఎస్ఐ నవీన్,
కార్యదర్శి ప్రశాంత్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.