జీవించే హక్కును హరిస్తున్న కూడంకుళం
తమిళనాడు, చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో తిరు నల్వేలి జిల్లాలో ఉంది కూడంకుళం. కన్యాకుమారికి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆనాటి సోవియన్ యూనియన్‌తో చర్చలు ప్రారంభమై 20 నవం బర్ 1988లో గోర్బచేవ్, రాజీవ్‌గాంధీల సంతకాలతో ఒప్పందం జరిగింది. రష్యా డిజైన్ చేసిన వాటర్ కోల్డ్, వాటర్ మోడరేటెడ్ వి.వి.ఇ.ఆర్ వెయ్యి మెగావాట్ల రియాక్టర్లు రెండింటితో మొదలుపెట్టి భవిష్యత్‌లో మరో 48 రియాక్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) ఆధ్వర్మంలో నిర్మాణం కొనసాగుతుంది. 2004లో సునామీ వచ్చి సముద్ర తీరప్రాంతాన్ని ముంచెత్తిన విషయం మనకు తెలిసిందే. ఈ రియాక్టర్ల నిర్మాణాన్ని ఎంచుకున్న ప్రాంతం కూడా సునామీ దాడికి గురయింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యం వల్లనే జపాన్‌లో ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంట్ ప్రమాదానికి గురయింది. ఈ కారణాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ ప్లాంట్లలో జరుగుతున్న ప్రమాదాలు ప్రజల జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాం దోళనలకు గురవుతున్నారు.తమిళనాడు సముద్రతీర ప్రాం తంలో అధికభాగం చేపల వేట మీద బతికే మత్స్యకారులే జీవిస్తున్నారు. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న తిరునల్వేలి, ట్యూటికోరిన్, కన్యాకుమారి జిల్లాల నుంచి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల చేపల ఎగుమతి జరుగుతుంది. తమిళనాడు చేపల వేట వ్యాపారంలో వ్యాపారంలో ఈ మూడు జిల్లాల నుంచి దాదాపు 70 శాతం ఉందంటే, ఆ ప్రాంత ప్రజల ప్రధాన జీవనా ధారం చేపల వేటేనని తెలుస్తుంది. ఈ అణువిద్యుత్ ప్లాంట్ ప్రారం భమై సముద్రంలోకి రియాక్టర్లు వదిలే అణు వ్యర్థ పదార్థాలు, వేడినీరు ఆ ప్రాంత చేపల ఉత్పత్తినే నాశనం చేస్తాయి. ప్రతి పాదించిన అణు రియాక్టర్ల నిర్మాణం జరిగితే సముద్ర జలాల ఉష్ణోగ్రత, కల్పకం ప్లాంట్ వద్దకన్నా విపరీతంగా పెరిగిపోయి ఆ ప్రాంతంలో 3,600 రకాల వివిధ సముద్ర జీవులు, అపురూపమైన చేపజాతులు నాశనం అయిపోతాయి.
వాళ్ల నిబంధనల ప్రకారం ప్రాజెక్టుకు 16 కిలోమీటర్ల రేడియస్‌లో పదివేల మంది ప్రజలే ఉండాలి. కాని అక్కడ 70 వేల మంది ప్రజలున్నారు. ఐదు కిలోమీటర్లు సెర్టిలైజెడ్ జోన్‌లో దాదాపు ఎవరూ ఉండకూదడు. కాని అక్కడ మూడు సెటిల్‌మెంట్లలో ప్రజ లున్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారిని ఎలా తరలిస్తారు. వారి పునరావాసం గురించి కూడా సరైన జవాబుదారీతనం అవ లంబించడం లేదు. ఫుకిషియాలాంటి ప్రమాదం జరిగితే ప్రాజెక్టుకు ముప్పై కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న పన్నెండు లక్షల మంది ప్రజల్ని కొన్ని గంటల వ్యవధిలో ఎలా తరలిస్తారనే ప్రజల ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. 2004 సునామీ వచ్చినపుడు చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పకం అణువిద్యుత్ ప్లాంట్‌ను మూసివేశారు. అటువంటి అవకాశం లేకపోతే జరగబోయే ప్రమాదం గురించి ప్రజలు భయపడుతున్నారు.ఆ మధ్య ప్లాంట్ లోపల నుంచి చెవులు చిల్లులు పడేటటువంటి పెద్ద శబ్దాలు వచ్చాయి. వాటి ప్రభావం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపించింది. దాంతో భయాందోళనలకు గురైన ప్రజలు ప్రశ్నిస్తే పైపులైన్ శుభ్రపరచడానికి స్టీంను నిరంతరాయంగా ఉపయో గించడం వలన శబ్దాలు వచ్చాయని చెప్పినా ప్రజలెవ్వరూ వాటిని నమ్మలేదు. పైగావారి భయాలు మరింత పెరిగిపో యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొదట ప్లాంట్‌కు వ్యతిరే కంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని ఆపు చేయాలని కోరింది. కాని ప్రజల్లో పెరుగుతున్న చైతన్యాన్ని గమనించి, కేంద్రంతో తనకు గల గొడవల్ని పరిష్కరించుకోవడానికి ఈ ఉద్యమం ఉపయోగ పడుతుందని, తిరిగి ప్లాంట్‌ను రద్దు చేయమనే కాకుండా ప్లాంట్ పనులు ఆపు చెయ్యాలని రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేయించింది.
ప్రధాని మన్మోహన్‌సింగ్ దూతగా కేంద్ర ఉపమంత్రి వి. నారాయణ స్వామి ప్రజల్ని బుజ్జగించడానికి కూడంకుళం వచ్చాడు. కాని 21 నవంబర్ 2010న ప్రజలు అతన్ని కనీసం మాట్లాడనివ్వకుండా ‘ప్లాంట్ మూసెయ్యాలి’ అనే ఒక్క నినాదంతో నోరు మూయించారు. దాంతో మంత్రి ‘ప్రజల ప్రాణాల భద్రతే నాకు మొదటి ప్రాముఖ్యత దాని తర్వాతే ప్రాజెక్టు అంశం’ అని ప్రకటించాడు. కాని వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ‘భద్రత ఉందా లేదా అనేది ప్రధానం కాదు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరైన సమాచా రమిచ్చామా లేదా అనేది ముఖ్యం’ అని ప్రకటించా రు.తర్వాత కేంద్ర ప్రభుత్వం 15 మంది నిపుణులతో ఒక కమిటీని ప్రజల్ని ఒప్పించడానికి పంపింది. వాళ్లు మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ కూడా చర్చిం చింది. చివరకు అణు విద్యుత్ ప్లాంట్ వలన ఎటువంటి ప్రమాదం లేదని, ప్లాంట్ భద్రత, రేడియేషన్, క్యాన్సర్ భయం, ఫుకుషి మాలాంటి ప్రమాదాలు, అణు వ్యర్థపదార్థాలు, వీటన్నింటి గురించి భయపడాల్సిన పనిలేదని మేం ఎంత చెప్పినా ప్రజలు మా మాటలు నమ్మడం లేదు’ అని కమిటీ కాన్వీనర్ డాక్టర్ ముత్తునాయగన్, సభ్యుడు బాలు మీడియా ముందు వాపోయారంటే ప్రభుత్వ యం త్రాంగం మీద ప్రజల నమ్మకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుం ది.ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కొందరు కార్యక ర్తలతో కలిసి ఫాదర్ అంబ్రోస్ ఢిల్లీలో అక్టోబర్ 7న ప్రధానమంత్రిని కలిసి నలభై నిమిషాలు తమ భయాల్ని, అనుమానాల్ని వివరంగా చెప్పారు. ప్రధాని తమ బాధను సానుభూతితో విన్నారని, అర్థం చేసుకొన్నారని వాళ్లు చెప్పిన కొద్ది రోజులలోనే ప్రధాని రాష్ట్ర ముఖ్య మంత్రి జయలలితకు ‘ప్రాజెక్టు’ అనుకున్న సమయంలో పూర్తి చెయ్యడానికి సహకరించాలని ఉత్తరం రాయడంతో ప్రజలకు ఎవర్ని నమ్మాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ప్రజా ఉద్యమం
1988లో సోవియట్ యూనియన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే తిరునల్వేలి జిల్లాలో అనేక ప్రజాసంఘాల ఐక్య సంఘటన ‘సమతువ సముదాయ ఇయక్కమ్’గా ఏర్పడి రెవ రెండ్ డేవిడ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపాయి. 1 మే 1988న కన్యాకుమారిలో పదివేల మందితో ‘జాతీయ మత్స్యకారుల యూనియన్’ ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మాండమైన ఊరేగింపుపై పోలీ సులు కాల్పులు జరిపి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. తర్వాత సోవియట్ కూలిపోవడంతో ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందని భావించారు.తిరిగి 1998లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కావడంతో నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జూన్ 2న తిరు నల్వేలిలో కలెక్టర్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లు కలిసి ప్రాజెక్టు ప్రాజెక్టు వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావం గురించి ఒక ‘ప్రజాభిప్రాయ సేకరణ’ తతంగం జరిపారు. కాకరాపల్లి, సోంపేట, ఎస్.కోట, చింతపల్లిలాంటి అనేక ప్రాంతాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా వేలాది మంది ప్రజల అభిప్రాయాల్ని ఏ మాత్రం గౌరవి ంచకుండా కేవలం రెండు గంటల్లోనే ముగించారు.అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం సమన్వయకర్త ఎస్‌పీ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న 127 మందితో నిరవధిక నిరాహార ప్రారంభమైంది. తమిళనాడు ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణాన్ని ఆపుచేయమని కేబినెట్ తీర్మానం చెయ్యడంతో 12 రోజుల తర్వాత దీక్షను నిలుపు చేశారు. ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్లాంట్ నిర్మాణానికి సహకరించమని ఉత్తరం రాయడంతో తిరిగి ప్రజలు దీక్షను ప్రారంభించారు. తిరునల్వేలి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యకారుల గ్రామం ‘ఇదింతకరై’లో ‘సెయింట్ లౌర్డ్స్ చర్చ్ ఉద్యమానికి కేంద్ర స్థానమ డయ్యింది. వంద సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ చర్చ్‌లో ఆ ప్రాంత పేద మత్స్యకార ప్రజలందరూ ప్రార్థనలు జరుపుకొంటారు. అక్టోబర్ చివరివారం నుంచి తిరునల్వేలి, ట్యూటికోరిన్, కన్యాకుమారి జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.అణు విద్యుత్ ప్లాంట్ ప్రాంతాన్ని డిసెంబర్ 10న 1500 మంది చుట్టుముట్టి పనులు ఆపాలని డిమాండ్ చేశారు. కలకత్తా నుంచి వచ్చిన కాంట్రాక్టర్ కార్మికుల్ని లోపలికి వెళ్లనివ్వ కుండా ఆపేశారు. ఇతరులనెవ్వరినీ కూడా వెళ్లనివ్వకుండా ఆపేశారు. ఇతరులనెవ్వరినీ కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. ఉద్యమ ం ప్రారంభమైన తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి తీసుకువచ్చిన వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కేవలం వంద మంది ఉద్యోగులు మూడు షిఫ్టులలో ప్లాంట్ నిర్మాణపు పనులు చేస్తున్నారు.
రష్యన్ రియాక్టర్లపై అనుమానాలు
జపాన్‌లో ఫుకుషిమా ప్రమాదం జరిగిన వెంటనే రష్యా అధ్యక్షుని ఆదేశాల మేరకు రష్యాలో నిర్మాణం అవుతున్న రియాక్టర్ల భద్రత గురించి తిరిగి అంచనా వేశారు. మినిస్ట్రీ ఆఫ్ నేచురల్ రిసో ర్సస్, ఫెడరల్ సర్వీసెస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజికల్, న్యూక్లి యర్ ఓవర్‌సైట్ (రోస్తోమ్)ల ఆధ్వర్యంలో తయారైన రిపోర్టు ప్రకారం ‘రష్యన్ రియాక్టర్లు ప్రకృతి సిద్ధమైన గాని మానవ ప్రేరేప తమైన గాని ఎటువంటి ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవని’ స్పష్టంగా పేర్కొన్నారు. నార్వేకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ టెక్నాలజీ’ సంస్థ చీఫ్ ఇంజినీర్ ఓల్ రియస్టాడ్ ‘ఆ రిపోర్ట్‌లో ఇంతవరకూ దేశంలోగాని, అంతర్జాతీయంగా కానీ ఎక్కడా ప్రక టించని అనేక లోపాల్ని బయటపెట్టిందని’ అన్నారు.రష్యా వి.వి.ఇ.ఆర్. రియాక్టర్లు చాలా అధునాతనమైన టెక్నాలజీతో నిర్మించినవని, ప్రమాద రహితమని అంటున్నారు. కానీ 1 మార్చి 2006న బల్గేరియాలో ‘కోజ్లుడుయ్ యూనిట్4’లో విద్యుత్ ఫెయిల్యూర్ వల్ల నాలుగు మెయిన్ సర్క్యులేషన్ పంప్స్‌లో ఒకటి ట్రిప్ అయి 61 కంట్రోల్ రాడ్లతో 22 రాడ్లు డ్రైవింగ్ మెకానిజంతో కదలలేదు. దీని వలన భద్రతకు చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. ఇదే సమస్య జెకొస్లోవేకియాలో టెమెలిన్‌లో కూడా జరిగింది. 1997లో భద్రతా సమస్యల వల్లనే తూర్పు యూరప్ దేశాల్లో రష్యన్ రియాక్టర్ల నిర్మాణాల కోసం యూ రోపియన్ బ్యాంక్ ఫర్ రికన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ఇవ్వాలనుకొన్న రుణాల్ని ఆపుచేసింది.
అణు పరిశ్రమకు చెందిన సరఫరాదారులందరు తమ రియాక్టర్లు ఎటువంటి ప్రమాదాలకు తావ్వ్ణివ్వని, పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉన్నాయని అంటున్నారు. కాని ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగే బాధ్యత వహించాలనే చిన్నపాటి నిబంధనకు వాళ్లు ఒప్పుకోక పోవడంతోనే ప్రమాదాలకు అవకాశ ముందని సులువుగా అర్థమవుతుంది. నిజానికి రష్యాకు చెందిన రియాక్టర్లను సరఫరా చేస్తున్న ‘ఆటమ్ స్ట్రోయిక్ స్పోర్ట్’ కంపెనీకి రక్షణగా భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యతగా హామీ ఉండడం వలన బాధితులు నేరుగా కంపెనీని నష్ట పరిహారం అడిగే అవకాశం లేదు. కాని ఈ మధ్య అణు పరిహార నిబంధనలు తమ కూడంకుళం ప్రాజెక్టుకు వర్తించవంటూ రష్యా కొత్త మెలిక పెట్టింది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న రెండు రియాక్టర్లకే కాకుండా ఇక ముందు సరఫరా ఇ ముందు సరఫరా చెయ్యబోయే నాలుగు రియాక్టర్లకు నష్టపరిహారం చెల్లించాలన్న నిబంధనల్ని సడలిస్తే సరఫరా చేస్తామని మెలికపెట్టడం సాజ్రాస్యవాదుల ముందు మోకరిల్లే మన పాలకుల విధానాలే కారణం.
– పి.వి. రమణ
(వీక్షణం సౌజన్యంతో..
రేపటి సంచికలో
అబ్దుల్ కలామ్ గారి విన్యాసం)