జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత

– ఎంపీడీవో సరస్వతి

కురివి ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం రాజోలు గ్రామంలో సోమవారం ఐటిసి- ఎంఎస్కె భద్రాచలం వారి ఈఎఫ్ఎఫ్ఓఆర్టి సంస్థ ఆధ్వర్యంలో, స్ధానిక సర్పంచ్ షేక్ మస్తాన్ సహకారంతో రాజోలు గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగంది.ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీడీవో సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన పర్యావరణం, వాతావరణం ఏర్పడితుంది అని అన్నారు.చెట్లు మానవ మనుగడకు దోహదం పడుతాయని,అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆత్మ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య మాట్లాడుతూ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణం పరిరక్షణ అని ఇది ప్రభుత్వం, ఆయా శాఖల బాధ్యత మాత్రమే కాదని,ప్రాధాన్యతను వివరిస్తూ…ప్రజలను భాగస్వామ్యం చేయ్యాలి అని ఆయన కోరారు. పెట్టిన ప్రతి చెట్టు బతికించాలి,అదే ప్రజల ముందు ఉన్న పెద్ద కర్తవ్యం రేపటి తరాలకు ఎదో ఇవ్వాలని అనుకుంటాం కానీ చెట్లు,ఆక్సిజన్ ఇవ్వాలి అని మానవాళి భవిష్యత్ కూడా మొక్కల పెంపకం చాలా కీలకం అని ఆయన తెలిపారు.సర్పంచ్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని,చెట్లు మానవ మనుగడకు దోహదం చేస్తున్నాయని,వర్షాలు సంవృద్దిగా కురవలంటే చెట్లు,అడవులు పెంచాలని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండే మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పెంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ రమేష్,ఎంపివో పద్మ, గ్రామ కార్యదర్శి సతీష్,వార్డు మెంబర్లు, రాగం భద్రయ్య,నల్ల విజయ,గుంటాక యాదగిరి,కే దాసు, మాధవరావు,పడాల మల్లయ్య,తోట ఉమా, రాడం వీరన్న,బస్వ సత్యం,బాసనబోయిన వరదయ్య,సీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.