జీహెచ్‌ఎంసీ కార్మికులను పర్మినెంట్‌ చేయండి

ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్‌, మే 7 (జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొ రేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మి కులను పర్మినెంట్‌ చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌  కార్యా లయ ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నా లో హరీష్‌రావు, కోదండరాం తది తరులు పాల్గొన్నారు. హరీష్‌రావు మాట్లాడుతూ, జిహెచ్‌ఎంసిలోని ఉద్యో గాలను సీమాంధ్ర ఉద్యోగులకు కట్ట బెట్టాలని ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నా రని ఆరోపించారు. జిహెచ్‌ఎంసిలోని ఖాళీగా ఉన్న 2,612 పోస్టులను స్థాని కులకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసు లను క్రమబద్దీకరించాలని, పర్మినెంట్‌ కార్మికులకు ఇళ్ళ స్థలాలు కేటా యించాలని   ఆయన డిమాండ్‌  చేశారు. హైదరాబాద్‌ను సుందరనగరంగా తీర్చిదిద్దుతున్న కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కష్టం కార్మికులది లాభం నేతలది అన్న మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు దాదాపు 30వేల మంది కార్మికులు శ్రమ చేస్తున్నారని, వీరిని మురికి మనుషులుగా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. గత 62 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేపట్టాని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిలో చలనం లేదని విమర్శించారు. మరో 38 రోజుల వరకు వేచి చూస్తామని, అప్పటి వరకు కూడా స్పందించకపోతే ప్రభుత్వం దిమ్మదిరిగేలా ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల కార్మికులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్ర నేతలకు వంద ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం కార్మికులకు 60 గజాల భూమి ఇవ్వలేకపోతోందని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికులు జీతాలు పెంచేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హరీష్‌రావు అన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే రోడ్ల శుభ్రత, డ్రైనేజీ, నీటి సరఫరా పనులను బంద్‌ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. కార్మికులు అధైర్య పడవద్దని, వారి వెనకాల టిఆర్‌ఎస్‌ ఉందని హరీష్‌రావు ధైర్యం, భరోసా ఇచ్చారు.
కార్మికులపట్ల మొండి వ్యవహరిస్తున్న ప్రభుత్వం : కోదండరాం
అనంతరం కోదండరాం మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిహెచ్‌ఎంసిలో అవసరమైన నిధులున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయకపోవడం సరికాదన్నారు. గతంలో పురపాలకశాఖ మంత్రికి డిమాండ్ల గురించి వివరించినా ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ మాది అని గొప్పలు చెపుకుంటున్న ఆ ఇద్దరు మంత్రులు కార్మికుల సమస్యలు వినపడడం లేదా అని కోదండరాం ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.