జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల

` నవంబర్‌ 11న పోలింగ్‌
` 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితం ప్రకటన
` షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ
న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. నవంబర్‌ 11న పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేస్తున్నట్లు పేర్కొంది. బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్‌ తదితర రాష్టాల్ల్రో పలు అసెంబ్లీ ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 13న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్లకు ఈనెల 21 వరకు గడువు విధించనున్నట్లు సమాచారం. అలాగే స్వీకరించిన నామినేషన్లను 22వ తేదీన పరిశీలన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. బీహార్‌తో పాటే నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదల: అక్టోబర్‌ 13, నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్‌ 21, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 22, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్‌ 24 పోలింగ్‌ తేదీ: నవంబర్‌ 11, ఓట్ల లెక్కింపు : నవంబర్‌ 14న ఉంటుంది.
నోటిఫికేషన్‌ విడుదల: అక్టోబర్‌ 13
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్‌ 21
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 22
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్‌ 24
పోలింగ్‌ తేదీ: నవంబర్‌ 11
ఓట్ల లెక్కింపు : నవంబర్‌ 14