జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. నవంబరు 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ (62) మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి, తాజాగా టికెట్ దక్కించుకున్నారు.