జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర
కరీంనగర్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఆత్మహత్యలు చేసుకొవద్దని రాబోయే రోజులు కార్మిక, కర్షక, బడుగు బలహీనవర్గాలవేనని బరశ్రీనోసా ఇచ్చేందుకే విజయమ్మ జూలై 23న రోజు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై చేనేత కార్మికుల ఉపాది óఅవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్షా, నిరసన కార్యక్రమం ఉంటుందని వైకాపా రాష్ట్రనేత ఆది శ్రీనివాస్ అన్నారు. చేనేత కార్మికులకు మూడు సంవత్సరాల కాలంలో ఎంపీగా పోన్నం ఒరగబెట్టిందేమిలేకున్న మొసలి కన్నీరు కార్చటంచూస్తే జాలిగా ఉందని వైఎస్‌ఆర్ అనుచరుడిగా ఉండి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగి వైఎస్‌పై విజయమ్మపై వ్యంగంగా మాట్లాడటం చూస్తే రాజశేఖర్ రెడ్డిపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 66కోట్లు సిరిసిల్లా నేత కార్మికులకు వివిధ సంఘాల ద్వారా మహిళ సంఘాలకు వడ్డిలేని రుణాలను మంజేరి చేసి ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేశారని ఆయన అన్నారు. పుట్టమధు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలినమయ్యే అవకాశముందని కేటిఆర్, కేసిఆర్ నిరాశ,నిసృహలకు లోనైనట్లు ఒకరి మాటకు ఇఒక్కరి మాటకు పోంతన లేకుండా మాట్లాడుతూ తెలంగాణ వాదులు డిఫ్రేషన్‌లోకి వేళ్ళే విధాంగా మాట్లాడుతున్నారని కరీంనగర్‌లో జై తెలంగాణ అని ఢీóల్లీలో నై తెలంగాణ అనేవారు కూడా జగన్‌ను విమర్శిస్తున్నారని ఎద్దేవ చేశారు. పింగళి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన టీఆర్‌ఎస్ పేటేంట్ కాదని రాష్ట్ర సాధనకు అందరం కలసి పోరాటంచేస్తేనే సాధించుతామని ఒక్క టీఆర్‌ఎస్‌తో ఏమి కూడా కాదని జగన్‌పై కేటిఆర్ విమర్శలు మానుకోవాలని అన్నారు.