జనంసాక్షి 🔥🔥ప్లాస్ ఫ్లాష్ 🔥🔥

👉క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలువిధులకు గైర్హాజరు, 8 మంది అంగన్‌వాడీ సిబ్బంది సేవల రద్దు.

👉విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌వాడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు.

👉జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్.

జనంసాక్షి ఉప్పునుంతల/నాగర్ కర్నూల్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో క్రమశిక్షణను పటిష్టపరచడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా జిల్లా పరిపాలన కీలక చర్యలు, ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెం.14 నిబంధనల మేరకు, దీర్ఘకాలంగా విధులకు హాజరు కాకుండా ఉన్న 8 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సేవలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అనుమతి లేకుండా నెలల తరబడి, కొందరు సంవత్సరాల పాటు విధులకు గైర్హాజరవుతూ కేంద్రాల నిర్వహణకు ఆటంకం కలిగించినట్లు వెల్లడించారు. సంబంధిత శాఖ అధికారుల నివేదికలు, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు చేపట్టి వారి సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించే కీలక వ్యవస్థగా ఉన్నందున సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు.అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న పలువురు అంగన్‌వాడీ సిబ్బంది 2023 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి వరకు వివిధ కాలాల్లో విధులకు గైర్హాజరవుతున్నట్లు రికార్డులు వెల్లడించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం వారి తొలగింపునకు ప్రతిపాదనలు సమర్పించగా, వాటికి ఆమోదం లభించినట్లు చెప్పారు.తొలగింపునకు గురైన వారిలో అచ్చంప