ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరికి తీవ్ర గా యాలు
సిరికొండ జూన్11: జనం సాక్షిసిరికొండ మండల కేంద్రం HP పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్, ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తూంపల్లి గ్రామానికి చెందిన అయినాల అశోక్ (వయసు 55 సంవత్సరాలు), ఏనుగంటి సాయిలు (వయసు 40 సంవత్సరాలు )ఇద్దరూ కలిసి బైక్‌పై (నెంబర్: TS16 EN3245) వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ ట్యాంకర్ (నెంబర్: TS16 UB0943) వాహనాన్ని బలంగా ఢీకొట్టారు.ట్యాంకర్ కింది భాగానికి బైక్ బలంగా తగలడంతో ఇద్దరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. బాధితుల్లో ఒకరికి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా, తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు 108 కు ఫోన్ చేసారు అంబులెన్సు వచ్చివారిని జిల్లా ఆసుపత్రి కి తీసుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



