ఎండు గంజాయి పట్టివేత

జూన్ 12 (జనం సాక్షి )భీంగల్భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడులు నిర్వహించి, భీమ్‌గల్ మండల పరిధిలోని షేక్ మజాస్.s/o యూనస్ అహ్మద్.వీరి వద్ద నుండి 100గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత గంజా సేవించే ముగ్గురు వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే దాని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించి, ఆ తర్వాత భీమ్‌గల్ తహసీల్దార్ ముందు వారిని బైండోవర్ చేసినట్లు ఎక్సై జ్ ఇన్స్పెక్టర్ వేణు మాధవరావు తెలిపారు. ఈ దాడి కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



