జె పి ఆశయ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
జనత దళ్ (యు) నాయకులు అంబాల మల్లేశం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 11.(జనంసాక్షి) దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంతో పాటు అనంతర కాలంలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ దేశం కోసం చేసిన సేవలను స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని జనత దళ్ (యు) నాయకులు అంబాల మల్లేశం అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జేపి నగర్ పార్కులో డాక్టర్ జయప్రకాష్ నారాయణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రా పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబాల మల్లేశం, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కుసుమ విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ చేసిన త్యాగాలు అసమానమైనవని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు జయప్రకాష్ నారాయణ అని ఆయన అందించిన స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. త్వరలోనే జెపి నగర్ పార్కులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అల్లే సత్యనారాయణ, పాసికంటి లచ్చయ్య, పాముల ఆంజనేయులు, కుసుమ రఘురాములు పలువురు నాయకులు పాల్గొన్నారు