జేఈఈ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు వరంగల్‌ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సమస్యలు తలెత్తకుండా ముందుస్తుగా ప్రణాళిక సిద్ధం చేశారు. త్రినగరిలో 61 కేంద్రాలలో జరిగే పరీక్షను

వరంగల్‌ పోలీసులు, లయన్స్‌క్లబ్‌ ప్రతినిధుల సహకారంతో 6 క్లస్టర్లుగా విభజించి 16 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా, ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 6నుంచి హెల్ప్‌లైన్‌ సెంటర్‌లు ప్రారంభమవుతాయని విద్యార్థులు, వారి వెంట వచ్చే తల్లిదండ్రుల వసతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయని అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వంతెనలపై భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.