జ్వరంతో బాలిక మృతి
జ్వరంతో బాలిక మృతి
ఆళ్లపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి)
జ్వరంతో బాలిక మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ వైద్యులు రేవంత్ తెలిపిన వివరాల ప్రకారం… ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సనశ్రీ(9) గత నాలుగు రోజులుగా జ్వరంతో రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేపించి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు వచ్చారని వైద్య పరీక్షల్లో ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు బుధవారం బాలికకు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆళ్లపల్లి నుండి ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.