జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
ఖమ్మం, అక్టోబర్ 26 : డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతమైన జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపడుతున్నామని మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 డెంగీ, 734 మలేరియా కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా 2.5లక్షల దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. రెండవ విడతగా 8వేల దోమ తెరలను పిహెచ్‌సిలకు మంజూరు చేశామని అన్నారు. జ్వర తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ దోమ తెరల పంపిణీకి సిద్ధం చేస్తున్నామన్నారు.