టాప్ ఆర్డర్ టపటపా.. ఓటమి అంచున భారత్
పనేసర్ ధాటికి కుప్పకూలిన బ్యాట్స్‌మెన్
ముంబయి , నవంబర్ 25 (జనంసాక్షి) :
దూకుడుగా ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు భోజన విరామం తర్వాత కుప్పకూలింది. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.. ఉదయం ఆట ప్రారంభం కాగానే తొలుత పీటర్సన్, కుక్ కుదురుగా ఆడుతుండడంతో భారీగా పరుగులు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ వారిద్దరూ ఓఝా, అశ్విన్‌లు ఔటు చేసి వారి నడ్డి విరిచారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులేమీ చేయకుండానే చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లండ్ 413 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇంగ్లండ్ భారత్ కంటే 86 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ కేవలం 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. గంభీర్, మొదట క్రీజులోకి వచ్చి ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 30 పరుగుల వద్ద సెహ్వాగ్ (9)ను పనేసర్ అవుట్ చేశాడు. అహ్మదాబాద్ టెస్టులో ధాటిగా ఆడి, ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో కీలక సెంచరీ చేసిన పూజారా కూడా ఈసారి చేతులెత్తేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి 37 పరుగుల వద్ద స్వాన్ బౌలింగ్‌లో బెయిల్ స్టోకు దొరికిపోయాడు, ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సచిన్ టెండుల్కర్ కూడా సెహ్వాగ్ పూజారా బాట పట్టాడు. సొంత మైదానంలో సచిన్‌కు చివరి ఆట కావచ్చునని సెంచరీ సాధిస్తాడని ఎదురు చూసిన అభిమానులను నిరాశపరచాడు. 52 పరుగుల వద్ద పనేసర్ బౌలింగ్‌లో సచిన్ (8) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి (7) స్వాన్ బౌలింగ్‌లో సబ్‌స్ట్యూట్ ఆటగాడు రూట్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. యువరజు 78 పరుగుల వద్ద ఎనిమిది పరుగులు చేసిన పనేసర్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. ధోనీ (6) కూడా పనేసర్ బౌలింగ్‌లోనే ట్రాట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధోనీ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అశ్విన్ (11) 110 పరుగుల వద్ద పనేసర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పటేల్ క్యాచ్ పట్టాడు. కీలకమైన సెహ్వాగ్, పూజారా, సచిన్, కోహ్లి, యూవీ, ధోనీలు అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్ కుప్పకూలడం అభిమానులకు మింగుడుపడడం లేదు. మన బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిలైన చోట ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోతున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 117 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఓటమికి చేరువలో ఉంది. భారత్ 31 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. గంభీర్ 53), హర్బజన్‌సింగ్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. పనేసర్ ఐదు వికెట్లు, స్వాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా అంతకుముందు మొదటి సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోగా రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో పటాపటా వికెట్లు పడిపోయాయి. అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్‌లలో ఒకరు ఆచితూచి మరొకరు దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును ఉదయం పరుగులు పెట్టించారు. 178 పరుగులతో ఆదివారం మూడో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ధాటగా ఆటను ప్రారంభించింది. అంతకుముందు రోజు 87 పరుగులతో ఉన్న కుక్ 62 పరుగులతో ఉన్న పీటర్సన్ బరిలోకి దిగి ఆదివారం తమ సెంచరీల పూర్తిచేసుకున్నారు. వీరిద్దరి తర్వాత ఎవరూ బాగ ఆడలేదు. బెయిర్‌స్టో 9, ఎస్‌ఆర్ పటేల్ 26, ప్రయర్ 21, బ్రాడ్ 6, అండర్సన్ 2, పనేసర్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రాఢ్ 21 పరుగులుచేసి నాటౌట్‌గా ఉన్నాడు. నిన్న ట్రాట్, కాప్టన్ వికెట్లు మాత్రమే తీసిన భారత్ ఈ రోజు విరామం సమయానికి ముందు కూడా రెండేసి వికెట్లు తీసింది. ఆ తరువాత భారత స్పిన్నర్లు రెచ్చిపోయి ఆరు వికె ట్లు తీశాడు. ప్రజ్ఞాన్ ఓఝా 5, హర్బజన్ సింగ్ 2, అశ్విన్ 2 వికెట్లు తీశారు. ప్రయర్‌ను కోహ్లి బౌలింగ్‌లో ధోనీ రనౌట్ చేశాడు. కీలకమైన కుక్ వికెట్‌ను అశ్విన్, పీటర్సన్ వికెట్‌ను ఓఝా తీశారు నిన్న రెండు వికెట్లు పడగొట్టిన ఓఝా ఈ రోజు మరో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డివిరిచాడు.