టిఆర్ఎస్ ను ఓడించేది బిజెపి నే

  కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు
  ముందు చూపు లేకపోవడంతో వరదల వల్ల అపార నష్టం
భూపాలపల్లి టౌన్ జూలై    (జనంసాక్షి)
       తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని బిజెపి రాష్ట్ర నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. వరదలను సమీక్షించడానికి వచ్చిన కేసీఆర్ పర్యటన ఆయన సొంతటూర్ల మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరద బాధితుల బాధితులకు పూర్తిగా అన్యాయం జరిగిందని తెలిపారు. కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదని బాధ్యతలు నుంచి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వరదలను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. గతంలో అనేక హామీలను ఇచ్చారని, అన్నింటినీ విస్మరించి మాటలతో నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సర్వస్వంక పోయిన వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని అన్నారు. నిత్యవసర సరుకులు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన గురవుతున్నారని వారికి భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్యాక్ రివర్స్ వాటర్ వల్లనే వరదలు వచ్చాయన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్లో లోపాలు ఉన్నాయని, నిర్లక్ష్యంగా కాళేశ్వరం  రూపొందించారని విమర్శించారు.ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లనే వరదల వల్ల నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
139 టియంసిలకు కరెంటు 3080 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది.
ఒక ఎకరెకు 27000 వేల  బిల్లు వస్తుంది. మాజీ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారని, తెలిపారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చేందుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పధకాలు ప్రజల సోమ్ముతో ఇస్తున్నారు కెసిఆర్ ఇంట్లో నుండి ఇవ్వడం లేదన్నారు.ప్రజల అభిప్రాయం అనుగుణంగా పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందను తెలిపారు.గోదావరి వరదల భాదితులకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అద్యక్షుడు కన్నం యుగేందర్ , రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్ రెడ్డి, నాగపూరి రాజమౌళి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఓరంగంటి జైపాల్ ,వేన్నంపల్లి పాపయ్య, దేవ సాంబయ్య ,చదువు రాంచంద్ర రెడ్డి, జన్నే మొగిళి జిల్లా ఇంచార్జి ఉదయ్ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నీషిధర్ రెడ్డి, ఏరుకల గణపతి, జగన్ నాయక్ వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు పాల్గొన్నారు.