టిఆర్‌ఎస్‌లో చేరిన ముదిరాజ్ కుటుంబాలు
జనగామ,అక్టోబర్10(జనంసాక్షి): టీఆర్‌ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి స్వచ్చందంగా మద్దతు లభిస్తోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండలం జిడికల్ గ్రామంలోని ముదిరాజ్ సంఘానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే తమ ఓటు అని ముదిరాజ్ కులస్థులు ముక్త కంఠంతో ప్రకటించారు. ముదిరాజ్ జిల్లా కార్యదర్శి కట్ల సదానందం, అధ్యక్షుడు నీలం రాములు గారి ఆధ్వర్యంలో..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటికొండ రాజయ్య సమక్షంలో ముదిరాజ్ కుటుంబాలు టిఆర్‌ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా తాటికొంద రాజయ్య మాట్లాడుతూ..లక్షల కోట్ల చేపపిల్లలను ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. మత్స్యకారులల కోసం టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను పంపిణీ చేసింది కేవలం మన టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.