టివిఆర్ ఓడబ్ల్యూఏ రాష్ట్ర కమిటీ నేడే విస్తృతస్థాయి సమావేశం

పీవీ మోహన్
రామారెడ్డి     జులై 23 జనంసాక్షీ :
 నేడు  భూపాలపల్లిలో వీఆర్వోల సంక్షేమ సంఘం,
 రాష్ట్ర  విస్తృతస్థాయి సమావేశంను జయప్రదం చేయాలని రాష్ట్ర వీఆర్వో లసంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పీవీ మోహన్ ఒక ప్రకటలో పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని మండల అధ్యక్ష, కార్యదర్శులు డివిజన్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గం విధిగా సకాలంలో హాజరు కావాలని కోరుచున్నాము,
 వీఆర్వోల న్యాయమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై భవిష్యత్ కార్యాచరణ,ప్రణాళికలు రూపొందించి అమలు చేయుటకు నిర్ణయాలు తీసుకోవలన్నారు.   మన సమస్యల పరిష్కారానికై రాజీలేని,శాంతియుత పోరాటాలు నిర్వహించ డానికి మనమందరం ఏకాభిప్రాయంతో సంసిద్ధు లం కావడానికే భూపాలపల్లి లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది, కావున అందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నామని చెప్పారు.  మనకు ఉద్యోగ భద్రత లేకుండా చేసి రెండు సంవత్సరాలు కావస్తుంది,
నేటికీ సమస్యలు పరిష్కారం చేయకుండా సర్కార్ దోబూచులాడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం  వీఆర్వోపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మనం మనోవేదన చెందుతున్నారు. మన సమశ్యలు పరిష్కారం చేయాలని సహనంతో విశ్వప్రయత్నాలు చేసినం
 అయినప్పటికీ ప్రభుత్వం ఎంతమాత్రం  స్పందించలేదు, కనీసం మన బాధలు వినేనాధుడు కరువైనారు.  ఈ ప్రభుత్వంలో లేకపోవడం విచిత్రంగా ఉంది. ఇట్లాంటి పాలకవర్గాన్ని, ప్రభుత్వాన్ని గతంలో చూడలేదు మునుముందు కూడా చూడకూడలేమన్నారు.  మన ఉద్యోగ హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు,
మన హక్కులను కాలరాయడానికి ఎవరికీ అధికారం లేదు. మన సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి. శాంతియుత మార్గంలో మన సమశ్యల పరిష్కారం కోరే హక్కు మనకు ఉన్నది. పాలకులు మన సమశ్య ల పరిష్కారం చేయకపోతే,  ప్రత్యక్ష ఆందోళనల ద్వారా కూడా కోరే హక్కు మనకున్నది. అప్పటికీ పరిష్కారం కాకపోతే న్యాయ పోరాటం…. గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వరకు పోయి న్యాయం పొందగలిగే చరిత్ర గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ లోనే 1984 లో విజయం  సాధించుకున్న చరిత్ర మనకున్నది. మనకు జరిగిన అన్యాయం పట్ల చైతన్యవంతంగా ఆలోచించి, మనమందరం కార్యోన్ముఖులమై మనకు న్యాయం జరిగేంత వరకు, పట్టువదలని విక్రమార్కుడు లాగా,
 రాజీలేని శాంతియుత పోరాటాలు నిర్వహిస్తూ,
 అంచలంచలుగా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి  నిరంతర కార్యాచరణ రూపొందించుకుని  అవసరమైతే ప్రజల మద్దతు కూడగట్టుకునే విధంగా కార్యాచరణ రూపొందిం చుకోవాల్సిన అవసరం ఉన్నది.  ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వారి సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఉద్యోగ జీవితాలు ఆగం చేసిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నది. మనను సామాజికంగా అగౌరవపరిచినవారి పట్ల కఠినంగా వ్యవహరించా ల్సి ఉన్నది.  ఎవరు కూడా దీన్ని ఆశామాశిగా తీసుకోవద్దు . ఎవరి దయాదాక్షిణ్యాల వలన వచ్చిన ఉద్యోగాలు కావివి. మన సమశ్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని మన పై అనేక ఒత్తిడికి,ప్రలోభాలకు ఆందోళనకు  గురిచేస్తారు. అయినప్పటికీ మన సమశ్యల పరిష్కారంపైననే మన ఏకాగ్రత ఉండాలి .
 అందుకే భూపాలపల్లి లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో మనం అన్ని రకాల చర్చోపచర్చలు ద్వారా ఒక నిర్ణయానికి వచ్చి కార్యాచరణ రూపొందించుకుని అమలు చేద్దామని అన్నారు.  అందరూ ఈ ఆదివారం తేది :24-07-2022న, 11 గంటల లోపే హాజరై సంఘం తీసుకునే కార్యాచరణ,కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, జయప్రదం చేయాలని కోరుచున్నాం,

గరికె ఉపేంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర హరాలే  సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
 తదితరులు పాల్గొన్నారు.