*టి షార్ట్ లు పంపిణీ చేసిన గంటా రవీందర్*
కొడకండ్ల,ఆగస్టు 29 ( జనం సాక్షి ) కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలో మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్వవస్థాపకులు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వావిలాల గ్రామ నివాసి గంట రవీందర్ గారు పాఠశాల లో చదువుచున్న70 మంది విద్యార్థులకు టీషర్ట్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గంటా రవీందర్ మాట్లాడుతూ చాలా డబ్బు సంపాదించిన వారి గురించి అందరికీ తెలువదు కాని పేదరికం లో ఉండి కూడా బాగా కష్టపడి చదివి సమాజ సేవ చేసిన అంబేద్కర్ లాంటి పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసింది ఆ విధంగా మీరు కూడా బాగా కష్టపడి చదివి అభివృద్ధి లోకి రావాలని తెలిపారు.ప్రస్తుతం పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండి విద్యార్థులు ఎక్కువగా ఉండడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నానందున ఒక వాలంటీర్ ను నియమించుటకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వాలంటీర్ వేతనం నగదు రూపంలో అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ అందె యాకయ్య మాట్లాడుతూ పిల్లలు బాగా కష్టపడి చదువండి రవీందర్ సార్ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కొరకు అనేక విదాలుగా సహకారాన్ని అందిస్తున్నారు.నా వంతుగా కూడా వాలంటీర్ కు మూడు నెలల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోర్నం ప్రభాకర్ మాట్లాడుతూ మా పాఠశాల పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాల పిల్లలు లాగా ఉండాలి అని రవీందర్ సార్ ను సంప్రదించగానే వెంటనే స్పందించి విద్యార్థులంరికీ టీషర్ట్ లు ఇవ్వడం చాలా సంతోషం మని రవీందర్ సార్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అందే యాకయ్య సి ఆర్ పి.జవ్వాజి జ్ఞానానందం.మైరెడ్మీర్ పాఠశాల కరెస్పాడెంట్ ప్రసన్న పాల్ పాఠశాల ఉపాధ్యాయులు కుసుమ రాజు విద్యార్థులు పాల్గొన్నారు.