టీడీపీ ఏం చేస్తది ?

నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరుగనుంది. ఇంతకు ముం దు జరిగిన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశాలకు లేని ప్రాధాన్యత ఈ సమావేశానికి దక్కింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో టీడీపీ అధినే త నారా చంద్రబాబు నాయుడు ‘తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్య మైన నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రకటించడమే. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలోనైనా బాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడిస్తారా, లేక ఎప్పటిలాగే తమ అరిగిపోయిన రికార్డు ‘రెండు కళ్ల సిద్ధాంతాన్నే’ వల్లె వేస్తారా అన్న సంశయం టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. తెలంగాణ టీడీపీ నాయకులు మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన అంటే, ఇప్ప టి వరకు చెబుతూ వస్తున్న రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని తేల్చి చెప్పడమేనని, దీన్ని మించిన ఇంకో ప్రత్యా మ్నాయం లేదని భావిస్తున్నారు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం సీ మాంధ్రులు కూడా అన్నదమ్ముల్లా విడిపోవాలని కోరుకుంటున్నారని, కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే తమ స్వార్థం కోసం ‘సమైక్య జపం’ చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ గుర్తి స్తే తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని వెల్లడిస్తుందని లేదా వ్యాపార, రాజకీయ దృష్టితో ఆలోచిస్తే మళ్లీ గతంలో చెప్పినట్లే తెలంగాణకు తాము వ్యతిరేకం కాదనో, కేంద్రం అడిగితే లేఖ ఇస్తామనో ప్రకటిస్తుం దని భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం తెలంగాణలో స్వ యంకృతాపధం వల్ల పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి రాబట్టుకోవా లని ‘తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు’ అన్న కొత్త పల్లవిని అందుకు న్నారు. ఈ కొత్తరాగం వల్లనే టీటీడీపీ నాయకులు తమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ తరుపున మార్గం సుగమం చేస్తారని భావిస్తున్నారు. ఇంతకు ముందు పలికిన ‘రెండు కళ్ల సిద్ధాంతం’ తెలం గాణలో పార్టీకి పుట్టగతుల్లేకుండా చేసిందన్న విషయం తమ అధినేతకు తెలిసి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. ఈ కారణాల వల్ల నేడు జరిగే టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో ‘ప్రత్యేక’ నిర్ణయం వెల్లడిస్తారని ఆశిస్తు న్నారు. రాజకీయ విశ్లేషకులు, టీటీడీపీ నాయకుల అభిప్రాయాలు ఇలా ఉంటే, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు మాత్రం ఒకవేళ చంద్రబాబు గానీ నేటి సమావేశంలో మళ్లీ తెలంగాణపై నాన్చుడు ధోర ణిని అవలంబిస్తే ఊరుకునేది లేదని, నేడు ఆ పార్టీ నిర్ణయం కోరుతున్న కేంద్రం భవిష్యత్తులో చంద్రబాబును సంప్రదించకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసేలా టీడీపీని దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగా ణలో టీడీపీ అన్న పదమే వినబడకుండా ఉద్యమం చేస్తామని, టీటీడీపీ నాయకులు ఆ పార్టీని వీడేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంకేతా లిస్తున్నారు. దీంతో తెలంగాణలోని కొన్ని టీడీపీ శ్రేణులు తమ అధినా యకుడి నిర్ణయం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కదలిక వచ్చినట్లు కథనాలు వెలువడడంతో, తమ నిర్ణయం ప్రకటించకుండానే కేంద్రం ఒకవేళ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు శూన్యంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, కాబట్టి, ఈసారి కచ్చితంగా టీడీపీ నిర్ణ యం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నా యని రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతంతో పూర్తిగా నష్టపోయిన టీడీపీకి ఈ ప్రాంతంలో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి వచ్చింది. ఇక సీమాంధ్రలో జగన్‌ హవా కూడా కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలం గాణలోని పరకాలతోపాటు సీమాంధ్రలోని అన్ని స్థానాల్లో టీడీపీకి డిపా జిట్లు కూడా దక్కకపోవడమే ఆ పార్టీ దుస్థితికి సాక్ష్యం. ఈ నేపథ్యంలో ఇంకా తెలంగాణపై నాన్చుకుంటూ పోతే పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డరేవ డి అవుతుందని పార్టీ ముఖ్య నాయకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ కారణం చేత ఈ పొలిట్‌బ్యూరో సమావేశంలోనైనా తెలంగాణపై పార్టీ వైఖరిని చంద్రబాబు స్పష్టం చేస్తారని, దీంతోనైనా మళ్లీ తెలంగాణలో బలపడవచ్చని అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఏదేమైనా నేడు జరిగే టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన డంలో సందేహం లేదు. ఈసారి కూడా చంద్రబాబు ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టుపై స్పష్టమైన వైఖరి తెలుపకుంటే, తెలంగాణలో ‘టీడీపీ’ అన్న పదమే కనుమగయ్యే ప్రమాదముందని మాత్రం తప్పక చెప్పుకోవచ్చు.