టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం కష్టమే : కపిల్
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారత టీంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ప్రదర్శించిన పేలవమైన ఆటతీరునే త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లోను ప్రదర్శిస్తే టీ20 ప్రపంచకప్ ఛాంపియ న్‌గా నిలవడం కష్టమని కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన అందరిలో జట్టుపై అపనమ్మకాన్ని ఏర్పరిచిందని భారత్ ఇలా ఓడటం జట్టులో తమపై తమకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. క్రికెట్‌లో భారత్ టీముకున్న పేరు ప్రతిష్టలు మరే జట్టుకు లేవని కోట్లాది మంది అభిమానుల ఆశలు నేరవేర్చేలా జట్టు కృషి చేయాలని, నా వరకు నాకు భారత్ జట్టు ప్రపంచ కప్ విజేతగా తిరిగివస్తుందనే నమ్మకం ఉంది. అందుకు జట్టు కఠోర శ్రమ చేయాలని కపిల్ దేవ్ తెలియజేశారు.