టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీలో మండలానికి ప్రాతినిధ్యం

ఫోటో రైట్ అప్ : రాజ్ కుమార్, ఆది రెడ్డి
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీలో మండలానికి ప్రాతినిధ్యం
భీమదేవరపల్లి అక్టోబర్ 07( సూర్య మేజర్ న్యూస్) :
హనుమకొండ జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు తోట సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల నిర్వహణలో టియుడబ్ల్యూజే ఐజేయు హనుమకొండ జిల్లా శాఖ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా భీమదేవరపల్లి మండలం నుండి జిల్లా సహాయ కార్యదర్శిగా వెలుగు రిపోర్టర్ మాడుగుల రాజకుమార్, కార్యనిర్వాహక సభ్యుడిగా ప్రజా మంటలు రిపోర్టర్ కాశిరెడ్డి ఆదిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల భీమదేవరపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ ,ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి రమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల సంపత్, మాట్ల హరికుమార్, గుడికందుల విజయ్, మాడుగుల సంతోష్ కుమార్, కనకం వెంకటేష్, నల్లగొండ నాగరాజు, అరుకాల అజయ్, గుడికందుల కిషోర్, బుర్ర స్వామి, జాన రమేష్ తదితరులు ఉన్నారు.