టీ ట్వంటీ ప్రపంచకప్‌కు అంతా రెడీ

రేపటి నుండే ధనాధన్‌
తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో జింబాబ్వే ఢీ
కొలంబో,సెప్టెంబర్‌ 17(ఆర్‌ఎన్‌ఎ):
ధనాధన్‌ సిక్సర్లు…
రాకెట్‌లా దూసుకెళ్లే ఫోర్లు…
నమ్మశక్యం కాని షాట్లు…
కళ్ళు చెదిరే యార్కర్లు…
ఊహకందని బంతులు..
మెరుపు ఫీల్డింగ్‌ విన్యాసాలు…
ఇక 20 రోజుల పాటు అభిమానులను అలరించే సంఘటనలు ఇవే…రేపటి నుండి శ్రీలంక వేదికగా ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌ ఆరంభం కాబోతోంది. ఉపఖండంలో తొలిసారిగా ఈ వరల్డ్‌కప్‌ జరుగుతోంది. షార్ట్‌ ఫార్మేట్‌లో సత్తా చాటేందుకు 12 దేశాలు సిధ్దమయ్యాయి. టీ ట్వంటీ ఫార్మేట్‌లో ఉండే మజానే వేరు.. నిమిష నిమిషానికీ మారే ఆధిపత్యం… బంతి బంతికీ ఉత్కంఠ.. మూడు గంటల ఆటలో ఎన్నో మలుపులు… సంచలనాలకు వేదిక… ఈ ధనాధన్‌ క్రికెట్‌లో సత్తా చాటేందుకు 10 ఐసిసి సభ్యదేశాలతో పాటు ఐర్లాండ్‌ , ఆప్ఘనిస్థాన్‌ లాంటి పసికూనలు కూడా పోటీపడుతున్నాయి. 2010లో ఇంగ్లాండ్‌ విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీ ట్వంటీలో ఎవరూ ఫేవరెట్‌ అని ఖచ్చితంగా చెప్పే వీలులేదు. క్షణక్షణానికీ సవిూకరణాలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సారి టైటిల్‌ ఫేవరెట్‌ అనే దానిపై స్పష్టత లేదనే చెప్పాలి. మొత్తం 12 దేశాలను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపు దశలో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కోసారి తలపడుతుంది. ప్రతీ గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధిస్తుంది. సూపర్‌ ఎయిట్‌లో మొదటి నాలుగు దేశాలు సెవిూస్‌కు చేరతాయి. ఫైనల్‌ అక్టోబర్‌ 7న కొలంబోలో జరుగుతుంది. కాగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ , మాజీ ఛాంపియన్‌ భారత్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. గత రెండు ఎడిషన్లలోనూ టీమిండియా నిరాశపరిచింది. కనీసం గ్రూప్‌ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది. ఇదిలా ఉంటే రేపు జరగనున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక , జింబాబ్వే తలపడనున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 19న ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే అన్ని జట్లూ వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ఆడాయి. వార్మప్‌ మ్యాచ్‌లలో కూడా ఊహించిన ఫలితాలు
ఏవిూ నమోదు కాలేదు. కాగా షార్ట్‌ ఫార్మేట్‌లో ఇది నాలుగో ప్రపంచకప్‌. ఉపఖండంలో జరగడం తొలిసారి.

గ్రూప్‌ ఎ ః ఇంగ్లాండ్‌ , భారత్‌ , ఆఫ్ఘనిస్థాన్‌
గ్రూప్‌ బి ః ఆస్టేల్రియా , వెస్టిండీస్‌ , ఐర్లాండ్‌
గ్రూప్‌ సి ః శ్రీలంక , దక్షిణాఫ్రికా , జింబాబ్వే
గ్రూప్‌ డి ః పాకిస్థాన్‌ , న్యూజిలాండ్‌ , బంగ్లాదేశ్‌

గ్రూప్‌ మ్యాచ్‌లు ః సెప్టెంబర్‌ 18 నుండి సెప్టెంబర్‌ 25 వరకూ
సూపర్‌ ఎయిట్‌ మ్యాచ్‌లు ః సెప్టెంబర్‌ 27 నుండి అక్టోబర్‌ 2 వరకూ
సెవిూఫైనల్స్‌ ః అక్టోబర్‌ 4 , 5
ఫైనల్‌ ః అక్టోబర్‌ 7

వేదికలు ః కొలంబో , ¬ంబన్‌టోట , పల్లెకెలె