టీ ట్వంటీ ప్రపంచకప్‌తో పండ పండిన ఈఎస్‌పిఎన్
యాడ్స్ ద్వారా 250 కోట్ల ఆదాయం
కొలంబొ,సెప్టెంబర్ 17 ళి(ఆర్‌ఎన్‌ఎ): క్రికెట్ న్యూ ఫార్మేట్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా స్పాన్సర్లు బాగానే లాభాలు పొందనున్నారు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌తో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఈఎస్‌పిఎన్‌కు భారీ ఆదాయం సమకూరనుంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఈఎస్‌పిఎన్‌కు యాడ్స్ ద్వారా 250 కోట్ల రూపాయలు వచ్చినట్టు అంచనా. రిలయన్స్ , హీరో మోటోకోర్ప్‌తో పాటు మొత్తం 34 కంపెనీలు టోర్నీకి స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తుండగా… ఆ కంపెనీల అడ్వర్టైజ్‌మెంట్స్ ఈఎస్‌పిఎన్‌కు లాభాల పంట పండించాయి. ఇప్పటికే అన్ని యాడ్ స్లాట్స్ పూర్తిగా అమ్ముడైపోయినట్టు ఈ కంపెనీ ప్రకటించింది. ఈ టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఈఎస్‌పిఎన్ పది సెకన్ల వాణిజ్య ప్రకటనకు 3.5 లక్షలు వసూలు చేస్తోంది. అభిమానులల్లో టీ ట్వంటీలకు ఉన్న అశేష ఆదరణ దృష్టిలో ఉంచుకున్న కంపెనీలు కూడా రేటు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని తెలుస్తోంది. రిలయన్స్ , హీరోమోటోకార్ప్‌తో పాటు హూండాయ్ , టాటా మోటార్స్ , పెప్సికో , నోకియా , టాటా టెలీ సర్వీసెస్ , యూనియన్ బ్యాంక్ వంటి కంపెనీలు యాడ్ స్లాట్స్ కొనుక్కున్న వాటిలో ఉన్నాయి. అటు లైవ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న ఈఎస్‌పిఎన్ ప్యానెల్‌లో మాజీ క్రికెటర్లు తమ విశ్లేషణలతో అలరించనున్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ , సంజయ్ మంజ్రేకర్ , నాసిర్ హుస్సెన్ , వసీం అక్రం , రవిూజ్ రాజా , టోనీ గ్రెగ్ , ఇయాన్ ఛాపెల్ , మార్క్‌వా , హర్షా భోగ్లే , అలెన్ విల్కిన్స్ వంటి వారున్నారు. అటు ఇంగ్లాండ్ జట్టుకు దూరమైన స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో కూడా ఈఎస్‌పిఎన్ ఒప్పందం కుదుర్చుకుంది.