టేకులపల్లి మండలం పి డి ఎస్ యు నూతన కార్యవర్గం ఎన్నిక

టేకులపల్లి, అక్టోబర్ 22( జనం సాక్ష): పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మహాసభ జరిగిన అనంతరం పిడిఎస్యు నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శనివారం టేకులపల్లి మండలం కేంద్రంలో గల జూనియర్ కళాశాలలో జరిగిన టేకులపల్లి మండలం పిడిఎస్యు 22వ మహాసభలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, మండలంలోని , విద్యా సంస్థలలో ఉన్న సమస్యలపై నూతన కార్యాచరణ తో పలు తీర్మానాలను ఈ మహాసభ ఆమోదించిందని జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ తెలిపారు. మండల నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.అధ్యక్షురాలు: చంద్రకళ,ఉపాధ్యక్షురాలు: అఖిల, ప్రధాన కార్యదర్శి: మహేష్,సహయ కార్యదర్శి: శ్రుతి,కోశాధికారి: అభిషేక్, సభ్యులు: సంగీత, నర్సింహ,అభిసారిక,సమత
మొత్తం 9 మందితో నూతన కార్యవర్గం ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు ఏ సాంబ తెలిపారు.