ట్రాక్టర్-ఆటో ఢీకొని ఒకరు మృతి
కరీంనగర్, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.