ట్రాఫిక్ పోలీసుపై కాల్పులు
గుర్గావ్ : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని ఆపినందుకు ట్రాఫిక్ పోలీసుపై ఓ వ్యక్తి కాల్పులుకు పాల్పడ్డాడు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సిగ్రేచర్ టవర్ వద్ద విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌సింగ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపారు. దీంతో వారు పోలీసుతో వాగ్వాదానకి దిగారు. ఇదే సమయంలో అందులోని ఒకరు తుపాకీతో ఇన్‌స్పెక్టర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. వెంటనే స్థానికులు గాయాలపాలైన పోలీసు అధికారిని మెదాంత ఆసుపత్రికి తరలించారు.