ట్వంటీ-20 మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలు
చెన్నై: చివరింటా పోరాడినా ఫలితం దక్కలేదు. భారత్, న్యూజీలాండ్ల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ట్వంటీ-20 మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. గంభీర్ (3) త్వరగా పెవిలియన్ దారి పట్టినా కోహ్లి కాస్తంత దూకుడుగా ఆడాడు. 41 బంతుల్లో 70 పరుగులు రాబట్టాడు. ఐతే ప్రాంక్లిన్ బౌలింగులో సౌతీకి చిక్కాడు. ఇక రైనా (27) కూడా పెద్దగా మెరుపులు యువరాజ్ సింగ్(34) కీలక వికెట్టును పడగొట్టడంతో మ్యాచ్ న్యూజీలాండ్ వైపుకు మళ్లింది ధోని(22) బంతులను బాగా ఖర్చు చేశాడు. ఆ తర్వాత శర్మ వచ్చినా ఫలితం దక్కలేదు. మ్యాచ్ న్యూజీలాండ్ ఎగరేసుకెళ్లింది.
స్కోర్లు:
న్యూజిలాండ్:167/5
భారత్:166/4
మెక్‌కల్లమ్ 91, విలియంసన్ 28, రాన్‌టేలర్ 25 (నటౌట్), జాకబ్ ఓరమ్ 18 (నాటౌట్)
న్యూజిలాండ్ బౌలింగ్: మిల్స్, ఫ్రాంక్లిన్ చెరో 2 వికెట్లు
భారత్ బౌలింగ్:
ఇర్ఫాన్ పఠాన్ 3, జహీర్‌ఖాన్, బాలాజీ చెరో వికెట్
భారత్ బ్యాటింగ్:
విరాట్‌కోహ్లి 70, రైనా 27, యువరాజ్‌సింగ్ 34, ధోని 22