డప్పు కళకారులు ఉద్యమించండి
రామడుగు జులై(జనంసాక్షి): డప్పు కళకారులు, డప్పును నమ్ముకున్న వారసులు ఉద్యమించే సమయం ఆసన్నమైందని డప్పుల మోత సేవ సంఘం అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఏ శుభకార్యనికైన తామే డప్పు చప్పుళ్లు చేస్తున్నమని, గ్రామపంచాయతీలో కిరోసిన్, బియ్యంలాంటి వాటికి తామే చాటింపు చేస్తున్నామని తెలిపారు. వృద్ధ డప్పు కళకారులకు వెయ్యి ఫించన్ ఇవ్వాలని, ప్రతి డప్పు కళాకారునికి రెండు లక్షల భీమా సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.