-డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎప్పుడు ఇస్తారు?

-మీకు దావత్ ఇవ్వడానికి పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి
వరంగల్ ఈస్ట్,జూలై 21(జనం సాక్షి)
 వరంగల్ నగర సమీపంలోని బొల్లికుంట శివారు ప్రాంతాల్లో ఉన్న సర్వే నంబర్ 476,484,506 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులందరికీ పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టి ఇవ్వాలని ఖిలా వరంగల్ మండల్ ఆఫీస్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి  మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం ఈ వరంగల్ నగరానికి వచ్చి గుడిసెలు వేసుకున్నవాసులు అందరికీ పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని  చెప్పిన ఈ సీఎం ఇప్పటివరకు ఏ ఒక్క గుడ్ సేవాసకి పట్టా ఇవ్వకపోవడం సిగ్గుచేటు  గరీంబ్ నగర్ ను అమీర్ నగర్ చేస్తానని చెప్పి మీరు నాకు  దావత్ ఇవ్వాలని చెప్పిన కేసీఆర్ మీకోసం పేద ప్రజలు  దావత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి పట్టా పత్రాలను తీసుకునిరా దావత్ ఇస్తారు.పోలీసు విభాగం పేద ప్రజల పై వారి జులుం చూపెడుతూ పేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్య అని పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే వారిపై కేసులు పెట్టే ఈ పోలీసులు ప్రైవేట్ భూ కబ్జాదారులు ఇదే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముతుంటే చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ విభాగం కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా దారులకు దారాదత్తం చేసే విధంగా చర్యలు ఉంటున్నాయని ప్రభుత్వ భూములను కాపాడుకునే బాధ్యత ప్రజలదే నని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మియామాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే బొల్లికుంట శివారు సర్వేనెంబర్ 476 484 506 లో గల ప్రభుత్వ భూములను గుర్తించి నిల్వ నీడలేని పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలను కట్టించాలని లేదా ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు లేదంటే ఈ జిల్లాలో ఉన్న పేద ప్రజలను కూడగట్టి ప్రభుత్వ భూములను గుర్తించి పేద ప్రజలకు పంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్ , ఖిలా వరంగల్ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు గన్నారపు రమేష్ , సంగీ ఎలేంధర్ ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్, ఖిలా వరంగల్ మండల సహాయ కార్యదర్శులు తాళ్ళపల్లి జాన్ పాల్, ఓర్సు రాజు, జిల్లా సమితి సభ్యులు ఎండి అక్బర్ పాషా  నాయకులు సుంకరి భవాని , నల్ల తీగల కుమార్ వనం సౌందర్య చిట్యాల సువర్ణ,యండి యాకుబ్, బాల, జన్ను రాజు చిరంజీవి , విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు