డాక్టరేట్ అవార్డు అందుకున్న రోండా మల్లారెడ్డి

 

 

 

 

 

 

శివ్వంపేట సెప్టెంబర్ 3 జనంసాక్షి : హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యకర్త,
ఆధ్యాత్మిక, సామాజిక వేత్త పూడూరు హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మకర్త రొండా మల్లారెడ్డి నిరంతరం సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. అతడి యొక్క సామాజిక సేవలను గుర్తించిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ కేంద్రం సంస్థ వారు మల్లారెడ్డి ని గౌరవ డాక్టరేట్  పురస్కారానికి ఎంపిక చేశారు. ఆ సంస్థ యొక్క ఫౌండర్, తమిళనాడు హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ మాలతి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని రొండా మల్లారెడ్డి డాక్టర్ నెల్లూరు ఆనందయ్య, బస్వా నంద, చైతన్యల సమక్షంలో శనివారం  అందుకోవడం జరిగింది. డాక్టరేట్ పురస్కార గ్రహీత రొండా మల్లారెడ్డి
మాట్లాడుతూ శ్రీ ధర్మశాస్త్ర, కలియుగ ప్రత్యక్ష దైవం,హరిహరుల తనయుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజంలో సామాజిక సేవలు, ఆధ్యాత్మిక సేవాలు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యకలాపాలు, స్వామి వారి కృపా చేతనే నాకు ఈ పురస్కారం లభించిందన్నారు. భవిష్యత్తులో సమాజంలో  ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే మన హిందూసనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధితో ధర్మాన్ని కాపాడుతామన్నారు. అదేవిధంగా నా శిష్యులను కూడా సన్మార్గంలో నడిపించే బాధ్యతను అయ్యప్ప స్వామి వారు నాకిచ్చిన గొప్పవరంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. నాకు వచ్చిన ఈ పురస్కారాన్ని  అయ్యప్ప స్వామికి  అంకితం చేస్తున్నట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు. రొండా మల్లారెడ్డి గౌరవ డాక్టర్ పురస్కారం అందుకోవడం పట్ల పూడూరు గ్రామస్తులు, సామాజికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తూ, మల్లారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.