డాక్టరేట్ పొందిన గిరిజన బిడ్డ

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న.
-బాదావత్ రమేష్ నాయక్.

కురివి ఆగస్టు -11 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బాదావత్ రమేష్ నాయక్ ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే పేదరికం శాపమై వెంటాడినప్పటికీ పేదరికాన్ని సైతం లెక్క చేయక చదువు కుంటు
హన్మకొండ జిల్లా పరకాల మండలము ప్రభుత్వ జూనియర్ కాలేజిలో లెక్చరర్ ఉద్యోగం చేస్తూ……
రూరల్ వరంగల్ జిల్లా లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట లో పనిచేస్తున్న భాదావత్ రమేష్ నాయక్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ఇందిరా అసోసియేట్ ప్రొఫెసర్ గైడెన్స్ లో పరిశోధన పూర్తి చేశారు .కుతుబ్ షాహీ పాలన కాలంలో ఎగుమతులు దిగుమతులపై చారిత్రక అధ్యయనం (1518-1687 ఎడి)” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. మొన్న జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 82.వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, ఓయూ వీసి ప్రొఫెసర్ రవీందర్ చేతులమీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
తదనంతరం పదోన్నతి పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం జరిగినది .