డిజిటలైజేషన్‌లో మనం ముందున్నాం

5

– ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): కంద్ర ప్రభుత్వంతో పోల్చితే డిజిటలైజేషన్‌ పరంగా తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ లోని తాజ్‌ కృష్ణ ¬టల్‌ లో జరిగిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. మిషన్‌ భగీరథ పైప్‌ లైన్లతో పాటు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేస్తూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటితోపాటు ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలో టాప్‌ ఫైవ్‌ ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్‌ లోనే లార్జెస్ట్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయన్నారు. టీ హబ్‌ తో స్టార్టప్‌ లకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియా టుడే సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌ దీప్‌ సర్దేశాయ్‌ తోపాటు.. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.