డిజిటల్ విద్యను ఉపయోగించుకోవాలి…

రిటైర్ ఐఏఎస్ అధికారి చక్రపాణి వెల్లడి
మంగళవారం రోజు తెలకపల్లి గురుకుల పాఠశాలలో  వివేకానంద వెల్ఫేర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వాలు అనేక విద్యాభివృద్ది పథకాలను చేపడుతుందని, అది సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
 ఆధునీకరణ పద్ధతుల ద్వారా మరియు డిజిటల్ తరగతుల ద్వారా చదువుకోవడం సులభం అవుతుందని అన్నారు. వాటి ద్వారా అన్ని స్థాయిలోవారు చక్కగా చదువుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో చక్రపాణి గారితో పాటు రిటైర్డ్ ఐ.జి.పి. డా.గాంధీ పి.సి.ఖాజా, జిల్లా విద్యా శాఖాధికారి గోవిందరాజులు, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్, కార్యదర్శి మాధవరెడ్డి,పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలత, సిబ్బంది మరియు వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు
జి.వి.రామకృష్ణ పాల్గొన్నారు.
అసోసియేషన్ వారు పాఠశాల గ్రంథాలయానికి గాంధీ సాహిత్యాన్ని అందించారు.