డిప్యూటీ సీఎం రాజయ్య ఓఎస్డీపై వేటు
నష్ట నివారణ చర్యలకు నడుం బిగించిన సర్కారు
వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేస్తాం
పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తాం
కేంద్ర బృందంతో సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): వైద్య పరమైన సమస్యలు,సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమర్ధంగా ఎదుర్కునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందం ముఖ్యమంత్రిని కలిసింది. కేంద్ర బృందంతో సమావేశమయిన సందర్బంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. గత ప్రభుత్వాలు సమస్యలు తలెత్తినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోలేదని వివరించారు. తమ ప్రభుత్వం లోపాన్ని సవరిస్తున్నదని వివరించారు. వేసవిలో కొన్ని, వర్షా కాలంలో కొన్ని, చలి కాలంలో కొన్ని ఇలా కాలానుగుణ వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. ఆసమయంలో హడావుడి చేయడం కన్నా ముందే ప్రజలకు అవగాహన కలిగించాడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఏకాలంలో ఏవ్యాధి ప్రభలుతుందో ముందే అంచనా వేసి దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని, గ్రావిూణ ప్రాంతాల్లో కూడా అందుకు అవసరమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటట్లు చూస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఆహారం, మంచినీళ్లు వల్లే ఎక్కువ వ్యాదులు వస్తున్నాయని, వీటి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బడ్జెట్, ఎక్కువ మంది సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖకే ఉన్నారని, ఈ సానుకూలతను వందకు వంద శాతం ఉపయోగించుకుంటామని వెల్లడించారు. రోగ నిర్ధారణకు అవసరమయ్యే యంత్రాలు కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచతామన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులు కూడా సామాజిక బాధ్యతను పంచుకోవాలనే ప్రభుత్వ పిలుపుకు సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్ధాయిలో సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. అప్పటిక్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బృందాన్ని మరో సారి రాష్టాన్రికి పంపాలని, జిల్లాల్లోని ఆసుపత్రులు కూడా సందర్శించేలా చూడాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.కేంద్ర ప్రజారోగ్య శాఖ అడీషినల్ డైరెక్టర్ జనరల్ డా.అశోక్‌కుమార్, డా.శశిఖరే,డా.ప్రదీప్, డా.మహేష్, డా.ప్రణయ్ కుమార్‌లతో కూడిన బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులను సందర్శంచింది. అనంతరం వారు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందానికి నేతృత్వం వహించిన డా.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని తెలంగాణలో బాగా తగ్గించిడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగ పడ్డాయన్నారు. స్వైన్‌ఫ్లూ పై యుద్దం ప్రకటించి రాష్ట్ర రాజధాని నుండి ఏరియా ఆసుపత్తులవరకు మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో, దేశంలోని చాలా రాష్టాల్ల్రో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా స్వైన్‌ఫ్లూ చలి కాలంలో వ్యాప్తిస్తుందని కూడా వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ బాధితులకు ఉచితంగా వైధ్యం అందించడం గొప్ప విషయమని, ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం వల్ల పేదలు కూడా వైద్యం చేయించుకోగలిగారని డా.అశోక్‌కుమార్ చెప్పారు. వచ్చే ఐదేళ్ల వరకు కూడా సరిపోయే మందులు తెలంగాణ రాష్ట్రం అందుబాటులోకి తెచ్చకున్నదని కేంద్ర బృందం ప్రశంసించింది. ఈసందర్బంగా కేంద్ర బృందం నాయకుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు చాలా బాగుందన్నారు. వివిధ ఆసుపత్రులు సందర్శించినప్పుడు అక్కడ వైద్యం అందుతున్న తీరు కూడా తమకు తృప్తినిచ్చిందని చెప్పారు. అయితే కొన్ని పత్రికల్లో కేంద్ర బృందం షాక్ అనే వార్తలు వచ్చాయని, ఆవార్తలు చూసి మేము షాక్ అయ్యామని డా.అశోక్‌కుమార్ అన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య,ప్రభుత్వ ప్రధాన కార్యధర్శి రాజీవ్‌శర్మ, ఆరోగ్యశాఖ కార్యదర్శి సురేష్‌చందా, డిఎంఇ శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కవిూషనర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.