డెంగ్యూతో ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం… మండలంలో మరో విషాదం భూపతిపూర్ లో డెంగ్యూతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి….
జనం సాక్షి సెప్టెంబర్ 18:-రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రబ్బాన (41) మృతి గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు ఈరోజు తుది శ్వాస విడిచారు రాయికల్ మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రబ్బాన అంకితభావంతో విధులు నిర్వహించేది. రాయికల్ మండలంలో గడచిన నాలుగు రోజుల కాలంలో దాదాపు 8 మంది చనిపోయిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజల్లో భరోసా నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అధికార యంత్రాంగం మరి ఏ విధంగా పనిచేస్తుందో మరి వేచి చూడాలి..