డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ (స్వాతంత్ర) అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన – కాంగ్రెస్ నేత మలోత్ నెహ్రూ నాయక్
డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ (స్వాతంత్ర) అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన – కాంగ్రెస్ నేత మలోత్ నెహ్రూ నాయక్
డోర్నకల్, నవంబర్ 10,జనం సాక్షి న్యూస్ :డోర్నకల్
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు మరిపేడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వత్తిడి మేరకు, ఆశేష జన సందోహం వెంట రాగా కోలాహలంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ…గత 10 సంవత్సరాలుగా డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ హోదాలలో ప్రజాసేవ చేస్తున్నాన నియోజకవర్గంలోనే నివాసముంటు అనునిత్యం పార్టీ కార్యకర్తల, ప్రజల
కష్టనష్టాలను కాపాడే వారికి గుర్తింపు కరువైందని ఆయన అన్నారు.డోర్నకల్ నియోజకవర్గంలో దాదాపు పది దశాబ్దాలుగా స్థానికేతర నాయకులు తిష్ట వేశారు.అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల నాడి ఏమాత్రం గ్రహించకుండా ప్రస్తుత ఎన్నికలలో సైతం స్థానికేతరులకు టికెట్లు కేటాయించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజల కోరిక మేరకు ఎన్నికలలో నేను డోర్నకల్ అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నాను.ఉన్నత ఉద్యోగ అవకాశం వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన నాకు, మీ ఆశీర్వాద బలంతో అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం దక్కిందని,ప్రస్తుత పర్యాయం నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ఆయన అన్నారు.డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి, మీ రుణం తీర్చుకుంటాను.చైతన్యవంతమైన డోర్నకల్ ఓటర్లు నాటి నైజాం సాయుధ పోరాట స్ఫూర్తితో…ఉద్యమించాలి డోర్నకల్ నాయకులను
డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల సత్తా చూపించి, అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకొని సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గుగులోత్ లాలు నాయక్, మహేందర్ రెడ్డి, డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డి ఎస్ జగదీష్, మాజీ ఎంపిటిసి బానోత్ శంకర్ నాయక్, మాలోత్ హరిలాల్, కొండపల్లి రఘురాం రెడ్డి, భూక్యా కాశీరం నాయక్,ఉపేందర్ గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జులు , వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.