*డ్రైవర్ల అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

 మండల మహాసభను జయప్రదం చేయాలి.
* సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి
 రామన్నపేట సెప్టెంబర్ 10 (జనంసాక్షి) రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ల అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మామిడి వెంకటరెడ్డి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి  డిమాండ్ చేశారు. రామన్నపేటలో డ్రైవర్లతో సమావేశo ఆయన పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్ లకు వ్యతిరేకంగా చేసిన  చట్టాలను రద్దు చేసి ప్రతి డ్రైవర్కు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వృద్ధలైన డ్రైవర్ల అందరికీ పది వేలు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఆటో డ్రైవర్ల అందరికీ ఉచితంగా లైసెన్సులు, ఇచ్చి ప్రతి అడ్డాకు అడ్డా స్థలం కేటాయించాలని,  ఆయన కోరారు. డ్రైవర్ ఐక్యంగా ఉండి తమ సమస్యలు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన మోటార్ వాహన చట్టం 2019 రద్దు చేయాలని ఆ చట్టం లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిట్నెస్ ఫీజు ఒక్క రోజుకు లేట్ ఫీజు 50 రూపాయలు  రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు*.
 *ఈ కార్యక్రమంలో ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుGబిక్షం,వెంకట్రావు, గోపాల్ రెడ్డి, మోటే బీరప్ప, పెళ్లి రాములు, ఎల్ శ్రీనివాస్, బండమీది శ్రీను, నరేష్, ఎల్లయ్య అంజి సురేష్,తదితరులు పాల్గొన్నార*.