ఢల్లీిలో ‘జానా’ లాబీయింగ్‌

న్యూఢల్లీి, జూన్‌ 4 (జనంసాక్షి) :
రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం ఢల్లీిలో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు సహా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి పార్టీని వీడిన నేపథ్యంలో జానా ఢల్లీి టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌లను మార్చవచ్చనే సమాచారంతో తనకు పదవి దక్కేలా అధిష్టానం పెద్దలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన జానా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాట్లాడేందుకు మాత్రమే తాను ఢల్లీికి వచ్చానని చెప్పారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై  గులాం నబీ ఆజాద్‌ తనను రమ్మన్నారని మంత్రి జానారెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఆజాద్‌కు తెలిపానన్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీలకు అధికంగా అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 18.88, ఎస్టీలకు  9.15, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు జానారెడ్డి తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆజాద్‌ను కోరినట్లు జానారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రి జానారెడ్డితో భేటీ అయ్యారు. పంచాయితీ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించారని సమాచారం. ఇక టిఆర్‌ఎస్‌లోకి వెళతారనుకున్న వరంగల్‌ ఎంపీ రాజయ్య కూడా  ఆజాద్‌తో భేటీ అయ్యారు. మొత్తానికి వీరు ఏం మాట్లాడారని తెలియకున్నా రాజకీయ చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.