ఢిల్లీలోనూ తప్పని కరెంటు కోతలు
ఢిల్లీ:ఓ పక్క ఉక్కపోత…మరో పక్క కరెంటు కోత…ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.నగరంలో పలుచోట్ల ఏకంగా 8,9 గంటలపాటు కరెంటు ఉండడంలేదు.ఆఖనిరి వీఐపీల నివాసాలుండే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోనూ నాలుగు గంటలపాటు కరెంటుకోత తప్పడం లేదు.రుతుపవనాల రాక ఆలస్యమైనందువల్ల ఉత్తరాది రాష్ట్రాలన్నిటా విద్యుత్ వాడకం పెరిగిందని,కోతలు తప్పడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంటున్నారు.రుతుపవనాలు వచ్చేవరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చంటున్న ఆమె సమాదానం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.కరెంటు కోతలకు నిరసనగా నిన్న పలుచోట్ల ఆందోళనలూ జరిగాయి.