ఢిల్లీలో మరో ఘోర అత్యాచారం
ఐదేళ్ల చిన్నారిపై రాక్షసంగా రేప్
చావు బతుకుల్లో పసిమొగ్గ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
ముద్దులొలికే పసిమొగ్గను పరిచ యస్తుడే కాటు వేశాడు. ఆడుకు నేందుకు వెళ్లిన చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరిపాడు. తాను మనిషిని కాదు రాక్షసుడిని అని చాటుకునేందుకు అత్యంత అమానవీయంగా ప్రవర్తిం చాడు. సభ్య సమాజం తలదించు కునేలా కూతురిలాంటి చిన్నారిని చెరిచి ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టాడు. రాక్షసకాండకు బలైపోయిన చిన్నారి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీ అత్యాచా రాలకు రాజధాని అని మరోమారు తేటతెల్లమైంది. ఇక్కడ మహిళలు, బాలికలకు రక్షణ కరువని తేలి పోయింది. ఢిల్లీలోని గాంధీనగర ్‌లో గల ఓ భవనంలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఐదేళ్ల చిన్నారి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఆమెను అదే భవనంలోని కింది అంతస్తులో ఉండే ఓ వ్యక్తి తన ఇంట్లోకి తీసుకెళ్లి వరుసగా అత్యాచారం జరిపాడు. పసిపాప అనే జాలి కూడా చూపకుండా రాక్షసంగా ప్రవర్తించాడు. అమె రహస్య అవయవాలు, ఛాతి, పెదవులు, బుగ్గలపై తీవ్రంగా గాయపరిచాడు. ఆమె శరీరంలో కొవ్వొత్తిని, 200 లీటర్ల కేశ తైలం సీసాను గుర్తించినట్లు స్వామి దయానంద్ ఆస్పత్రి వైద్యుడు ఆర్కే బన్సాల్ తెలిపారు. ఆమె లైంగిక దాడితో భీతిల్లిందని, పూర్తిగా స్పృహలో లేదని, తీవ్రమైన బాధతో విలవిలాడుతోందని ఆయన పేర్కొన్నాడు. మొదట తాము పరీక్షలు జరిపేందుకు కూడా అంగీకరించలేదని, జ్వరం కూడా వచ్చిందని చెప్పాడు. మందులు ఇవ్వడంతో మొదట తగ్గిన జ్వరం మళ్లీ తిరగబెట్టిందని పేర్కొన్నాడు. ఒంట్లో ఉన్న కొవ్వొత్తి, సీసా వల్ల కడుపులోపలి భాగంలో ఇన్ఫెక్షన్ సోకిందని వివరించాడు. అనెస్థీషియా ఇచ్చి మరిన్ని పరీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ తాను చూసిన అత్యంత దారుణమైన కేసు ఇదేనని బన్సాల్ తెలిపాడు. ఆడుకోవడానికి వెళ్లి అపహరణకు గురైన చిన్నారిని గురువారం నిందితుడి ఇంట్లో గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 48 గంటలు దాటితేగాని పరిస్థితి చెప్పలేమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి కోరింది.
అత్యాచారం సిగ్గుచేటు
నేను తీవ్రంగా కలతచెందా
అత్యాచార రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించాలి : ప్రధాని
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం సిగ్గుచేటు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో మరో చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. అత్యాచార రక్కసిని కూకటివేళ్లతో పెలికిలించాలి. ఈ దిశగా కృషి చేయాలని సమాజానికి విజ్ఞప్తి చేశారు. సంఘటనపై ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యవహారశైలి ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై కఠినమైన చర్య తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నాను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.