‘జనంసాక్షి’ ఎఫెక్ట్.. కాళేశ్వరం ఆలయ ఈవో తొలగింపు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి దేవాలయ ఈవో మారుతిని బాధ్యతల నుండి తొలగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో ఈ నెల 20న ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ తీశారు. ఈ విషయంపై ఈ నెల 21న ‘జనంసాక్షి’ మినీలో ‘భక్తులు ఫోటోలు తీయొద్దు సరే.. షూటింగ్ కు అనుమతెలా ఇచ్చారు?’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు స్పందించిన దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి విచారణ చేపట్టి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈవో మారుతిపై వేటు వేశారు. ఆలయ ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా రేగొండ మండలం కొడవటంచ ఆలయ ఈవో గా విధులు నిర్వహిస్తున్న మహేష్ కు కాళేశ్వరం దేవస్థానం ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.